తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్న హీరోయిన్ తమన్నా( Actress Tamannaah Bhatia ) ఈమె మంచు మనోజ్ తో కలిసి శ్రీ అనే సినిమా చేసింది.ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ మొదటి సినిమా అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదని చెప్పుకోవచ్చు.
కానీ ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన హ్యాపీడేస్ సినిమా తమన్నా కి స్టార్ స్టేటస్ తెచ్చింది.

అలా ఈ హీరోయిన్ తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆఫర్లతో దూసుకుపోతుంది.ఇక తమన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 17 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇంకా బిజీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న భోళాశంకర్( Bhola Shankar ) లో,తమిళ్లో రజనీకాంత్ సరసన జైలర్ అనే సినిమాలో నటిస్తుంది…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్న బాలీవుడ్( Bollywood ) లో కూడా కొన్ని వెబ్ సిరీస్, సినిమాల్లో నటిస్తోంది.
ఈ మధ్య తమన్నా కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించేసరికి తమన్నాపై చాలామంది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం పక్కన పెడితే ఏ హీరోయిన్ కూడా సంపాదించన ఆస్తిని తమన్నా సంపాదిస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది…

ఇక ఒక సినిమాకి 5 నుండి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్( Tamannaah Remuneration ) తీసుకుంటున్న తమన్నా ఏడాదికి 18 కోట్ల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే 150 కోట్ల ఆస్తి( Tamannaah Properties Value ) ఉన్న తమన్నకి యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ సినిమాలతో సహా కొన్ని బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి కోట్లలో సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక నెలకి తమన్నా సంపాదన రెండు నుండి మూడు కోట్ల వరకు ఉంటుందట.
అలాగే తమన్నాకి ఖరీదైన కార్లు, విలాసవంతమైన విల్లాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది…ఇక ఇప్పటికీ తమన్నా సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది…