అక్కడ వైన్ ఫెస్టివల్.. 400 డ్రోన్‌లు ఆకాశంలో వైన్ అందించాయి

ఇటీవల డ్రోన్ల( drones ) వినియోగం బాగా పెరిగింది.డ్రోన్లతో అనేక అద్బుతాలు చేస్తున్నారు.

 There Is A Wine Festival 400 Drones Serve Wine In The Sky , Viral Latest, News V-TeluguStop.com

డ్రోన్లతో ఆకర్షించేలా చిత్రాల ద్వారా ఏ విషయాన్ని అయినా చెప్పవచ్చు.ఇటీవల వేడుకల సమయంలో డ్రోన్లతో అనేక రూపాల్లో ఆకాశంలో చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.

ఇటీవల ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది.అయితే తాజాగా డ్రోన్లతో ఆకాశంలో వైన్ బాటిల్( wine bottle ) నుంచి గ్లాసులో మందు పోస్తున్నట్లు ప్రదర్శన చేశారు.

ఫ్రాన్స్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఫ్రాన్స్‌లోని బోర్డో‌క్స్‌లో( Bordeaux, France ) జూన్ 23,24వ తేదీలలో వైన్ ఫెస్టివల్ నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా ఆకాశంలో వైన్ బాటిల్, వైన్ గ్లాస్ తో కాంతి చిత్రాన్ని చూపించారు.ఇందుకోసం 400కిపైగా డ్రోన్లను ఉపయోగించారు.400కిపైగా డ్రోన్లు వైన్ బాటిల్, వైన్ గ్లాస్ ఆకారంలో కాంతి చిత్రాన్ని రూపొందించాయి.ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

గ్లాసులో వైన్ పోస్తున్నట్లు చిత్రాన్ని ప్రదర్శించారు.ఇది చూపరుల కళ్లను తెగ ఆకట్టుకుంది.

ది ఫిజెన్ అనే ట్విట్టర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.ఇప్పటివరకు 6 మిలియన్ల మంది యూజర్లు ఈ వీడియోను తిలకించారు.

పండుగకు బాణసంచా అవసరం లేదని, డ్రోన్లు వచ్చిన తర్వాత ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తున్నామని నెటజన్లు కామెంట్ చేస్తోన్నారు.ఇది సూపర్ అండ్ యూనిక్ మార్కెటింగ్ టెక్నిక్ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.వైన్ రుచిని పెంచే డ్రోన్ ఉన్నప్పుడు బాణసంచా ఎందుకని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.దాదాపు నాలుగు రోజుల పాటు ఈ వైన్ పండుగ జరిపారు.400 డ్రోన్లు వైన్ సర్వ్ చేసిన ఈ చిత్రం హైలెట్ గా నిలిచింది.బోర్డియక్స్, నౌవెల్లె, అక్విటైన్ ప్రాంతంలో ప్రతి ఏడాది ఈ వైన్ ఫెస్టివ్ జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube