యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) రాఘవుడిగా మారి నటించిన భారీ మైథలాజికల్ మూవీ ”ఆదిపురుష్”. ఈ సినిమా ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా జూన్ 16న శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మిశ్రమ టాక్ తెచ్చుకుంది.
ఈ టాక్ ప్లాప్ దిశగా కొనసాగింది.మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను సాధించింది.ఇది ప్రభాస్ క్రేజ్ నో లేదంటే ఆదిపురుష్ వంటి దృశ్య కావ్యాన్ని ఒక్కసారైనా చూడాలనే ప్రేక్షకుల ఇంట్రెస్ట్ నో తెలియదు కానీ తొలి వీకెండ్ మాత్రం ఈ సినిమా బాగా కలెక్షన్స్ ను సాధించి ఏకంగా 340 కోట్ల రూపాయలను( Adipurush Movie Collections ) కలెక్ట్ చేసింది.
అయితే మూడు రోజుల తర్వాత పరిస్థితి మారిపోయింది.టాక్ ఎలా ఉన్న కలెక్షన్స్ వస్తున్నాయిలే అనుకున్న టీమ్ కు ఈ సినిమా నాల్గవ రోజు నుండి వచ్చిన ఫలితాలు పూర్తిగా నిరాశ కలిగించాయి.
ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా 10 రోజుల్లో 450 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.నంబర్ ఇంత ఉన్న ఈ సినిమాకు ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ సినిమా ఇంకా ఎక్కడ బ్రేక్ ఈవెన్ సాధించలేదు.కానీ ఆదిపురుష్ హిందీ వర్షన్( Adipurush Hindi Version ) హిట్ అనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ సినిమాను హిందీలో టి సిరీస్ సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది.అయినప్పటికీ హిందీ వసూళ్లతో అలా సరిపోయిందని ఏది ఏమైనా నార్త్ లో ఆదిపురుష్ చిత్రం హిట్ అనే టాక్ నెట్టింట వైరల్ అయ్యింది.
హిందీలో హిట్ అయినా కూడా మిగిలిన భాషల్లో భారీ నష్టం అయితే తప్పదు.