రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.పెళ్లి అయిన ఇన్నాళ్ల తర్వాత చరణ్ దంపతులు తల్లిదండ్రులు అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంది.
ఎప్పుడెప్పుడు చరణ్ బిడ్డను చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక చరణ్ దంపతులు ఇటీవల కూతురుతో కలిసి ఇంటికి చేరారు.
ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు తమ బిడ్డను ఎత్తుకోవడంతో పాటు తమ పెట్ డాగ్ రైమ్ ను కూడా ఒల్లో కూర్చోబెట్టుకున్నారు.
రైమ్ అంటే చరణ్ మరియు ఉపాసనలకు ఎంతో ఇష్టం.విదేశాలకు వెళ్లినా కూడా విమానంలో రైమ్ ను తీసుకుని తప్పకుండా వెళ్లేవారు.అంతటి ఇష్టం ఆ కుక్కపిల్ల అంటే.మీడియా సమావేశానికి కూడా రామ్ చరణ్ ఆ పెట్ డాగ్ తో పలు సార్లు వచ్చిన విషయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది.
అలాంటి రామ్ చరణ్ దంపతులు తమకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ కుక్క పిల్లను వదలడం లేదు.
తాజా ఫోటోలో కూడా బిడ్డ తో పాటు రైమ్ ను కూడా ఎత్తుకుని ఉన్నారు.రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు రైమ్ అంటే ఎంతగా ఇష్టమో ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా ఫ్యామిలీ మెంబర్స్ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిడ్డ పుట్టిన తర్వాత కూడా రైమ్ ను వదలని మెగా దంపతులను మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు అభినందిస్తూ ఉన్నారు.
రామ్ చరణ్ బిడ్డ పుట్టడంతో తాను ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.