చూయింగ్ గమ్‌కి పోటీగా గుడ్‌గమ్‌ సృష్టించిన సోదరులు.. వారి సక్సెస్ స్టోరీ తెలిస్తే..

చూయింగ్ గమ్ లేదా బబుల్ గమ్‌ను చాలా మంది ఇష్టపడతారు.వాటితో పెద్ద బుడగలు ఊదడానికి, నోటి దుర్వాసనను పోగొట్టి, ఫ్రెష్‌నెస్‌ను జోడించడానికి లేదా బోరింగ్ పనుల సమయంలో యాక్టివ్‌గా ఉండటానికి వీటిని నమిలేస్తుంటారు.

 The Brothers Who Created Good Gum To Compete With Chewing Gum.. If You Know Thei-TeluguStop.com

అయితే, చూయింగ్ గమ్ వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.ప్రపంచంలో చెత్తను పెంచుతున్న వాటిలో గమ్ వ్యర్థాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి.

ఈరోజుల్లో అందుబాటులో ఉన్న చూయింగ్ గమ్ ప్లాస్టిక్ వంటి సులభంగా విచ్ఛిన్నం కాని పదార్థాలతో తయారు అవుతోంది.ఇది మన ఆరోగ్యానికి హాని కలిగించే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు, రుచులను కూడా కలిగి ఉంటుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా బెంగుళూరుకు చెందిన మయాంక్, భువన్ నగోరి ( Mayank Bhuvan Nagori )అనే ఇద్దరు సోదరులు గుడ్ గమ్ సృష్టించారు.గుడ్ గమ్ అనేది ప్లాస్టిక్ ఫ్రీ( Plastic-free gum ), బయోడిగ్రేడబుల్ గమ్.ఇది ఒక వెజిటేరియన్ గమ్ కూడా.కాబట్టి దీనిని అందరూ వినియోగించవచ్చు.

చూయింగ్ గమ్‌ కాలుష్య సమస్యను పరిష్కరించి ఆరోగ్యకర గమ్‌ అందించాలని వీరు గొప్ప ఆలోచన చేశారు.అంతేకాదు, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి ఈ చూయింగ్ గమ్‌ కాలుష్య సమస్యను చాలా వరకు తగ్గిస్తున్నారు.

ఇప్పటికే భూగ్రహాన్ని కలుషితం చేయకుండా 750-800 కిలోగ్రాముల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఆదా చేయడంలో గుడ్ గమ్ సహాయపడింది.దాదాపు 12,000 మంది కస్టమర్లకు ఈ సోదరులు తమ గుడ్ గమ్ అమ్మారు.గుడ్ గమ్‌కు NSRCEL-IIMB ప్లాట్‌ఫామ్ మద్దతునిస్తోంది.

మయాంక్, భువన్ తమ చిన్నతనంలోనే రెగ్యులర్ గమ్ సమస్య గురించి తెలుసుకున్నారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం గురించి ఆలోచించే కుటుంబంలో వారు పెరిగారు.ఇది వారిని ప్రకృతితో మరింత కనెక్ట్ చేసింది.

ఆ సమయంలో చూయింగ్ గమ్ ప్లాస్టిక్‌తో తయారు అవుతుందని, అది కుళ్ళిపోవడానికి చాలా సమయం పడుతుందని చిన్నతనంలోనే మయాంక్ తెలుసుకున్నాడు.

కొన్ని సంవత్సరాల తరువాత, మయాంక్ ఆహార ఉత్పత్తి నిర్వహణను అధ్యయనం చేశాడు.

సాధారణ చూయింగ్ గమ్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు చాలా తక్కువగా ఉన్నాయని గ్రహించాడు.యూఎస్‌లోని ఒక కంపెనీ నుండి ప్రేరణ పొంది, అతను భారతదేశంలో అలాంటిదే సృష్టించాలని నిర్ణయించుకున్నాడు.

అలా అతను తన సోదరుడితో కలిసి సాధారణ గమ్‌ను భర్తీ చేశాడు.

రెగ్యులర్ చూయింగ్ గమ్‌ను పాలీ వినైల్ అసిటేట్( Polyvinyl acetate ) అనే రసాయనంతో తయారు చేస్తారు, దీనిని రబ్బరు టైర్లు, జిగురులో కూడా ఉపయోగిస్తారు.

ఇది రంగు, రుచి కోసం కృత్రిమ పదార్ధాలతో కలుస్తుంది.ఇది ఆరోగ్యానికి హానికరం.

దీనికి విరుద్ధంగా, గుడ్ గమ్ చెట్ల పసరు, సహజ పండ్ల పదార్థాలు, కూరగాయల రంగులతో తయారు అవుతుంది.ఇది జిలిటోల్, స్టెవియా వంటి సహజ స్వీటెనర్లను ఉపయోగిస్తుంది.

ప్రతి గమ్‌లో ఒక కేలరీ మాత్రమే ఉంటుంది.అందుకే గుడ్ గమ్స్‌కి మంచి డిమాండ్ ఏర్పడింది.

వీటిని అమెజాన్ వంటి ఆన్‌లైన్ డెలివరీ సైట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Gud Gum Founder Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube