కూతురిని చూసిన వెంటనే రామ్ చరణ్ అలా చేశారా.. తండ్రి ప్రేమకు ఫిదా అంటూ?

మెగా కుటుంబంలో మూడో తరం మొదలైంది.ఉపాసన( upasana ) పండంటి పాపకు తెల్లవారుజామున జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి.

 Ram Chaaran Expressions About Seen His Daughter Details Here Goes Viral , Ram C-TeluguStop.com

రామ్ చరణ్ ( Ram Charan )కూతురుని చూడగానే మురిసిపోవడంతో పాటు కూతురు నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టారని సమాచారం.కూతురిని తొలిసారి చూసిన వెంటనే చరణ్ కంటి వెంట ఆనంద భాష్పాలు వచ్చాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Telugu Game Changer, Ram Charan, Upasana-Movie

తండ్రిగా చరణ్ కూతురిపై చూపించిన ప్రేమకు ఫిదా అవ్వాల్సిందేనని తెలుస్తోంది.త్వరలో చరణ్ తన సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.చరణ్ ఉపాసనల కూతురుకు పేరు సైతం ఫిక్స్ అయిందని త్వరలో పేరుకు సంబంధించిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది.ఈ చిన్నారికి సంబంధించిన ప్రతి ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందని సమాచారం.

కొణిదెల, కామినేని కుటుంబాలు( Konidela and Kamineni families ) చిన్నారిని చూసి మురిసిపోతున్నాయని తెలుస్తోంది.చిన్నారి పోలికల గురించి చిరంజీవిని ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేనంటూ చిరంజీవి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

చరణ్ కూతురి జాతకం కూడా చాలా బాగుందని సమాచారం అందుతోంది.చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్( game changer ) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Telugu Game Changer, Ram Charan, Upasana-Movie

చరణ్ శంకర్ కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తోందని సమాచారం అందుతోంది.ఈ సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.దిల్ రాజు తన కెరీర్ ను రిస్క్ చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం.చరణ్ కొన్ని వారాల పాటు కుటుంబానికే పరిమితం కానున్నారని సమాచారం అందుతోంది.

కూతురి ఎంట్రీతో తన కెరీర్ కు మరింత పాజిటివ్ గా జరుగుతుందని చరణ్ భావిస్తున్నారు.చరణ్ కెరీర్ పరంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube