ఈ టీ స్టాల్ స్పెషాలిటీ వేరే.. ఛాయ్ ఇలా కూడా తాగొచ్చా..

ఇటీవల వినూత్న ఆలోచనలతో తమ క్రియేటివిటీని చాలామంది బయటపెడుతున్నారు.కొత్త ఐడియాతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

 The Specialty Of This Tea Stall Is Different Can You Drink Chai Like This Too, C-TeluguStop.com

పాత ఆలోచనలను ఫాలో అయితే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము.ఏ రంగంలో అయినా అంతే.

ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో ముందుకు పోవడం వల్ల ఏ రంగంలోనైనా సులువుగా ఎదగవచ్చు.ఇక బిజినెస్ రంగంలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఒక టీ స్టాల్ ( A tea stall )యాజమాని కొత్త ధీమ్ తో అందరినీ ఆకర్షిస్తున్నాడు.అదేంటంటే.

అహ్మదాబాద్‌కు ( Ahmedabad )చెందిన ఓ టీస్టాల్ నిర్వాహకుడు చనిపోయిన వ్యక్తుల మధ్య కస్టమర్లకు వేడి వేడి టీ సర్వ్ చేస్తున్నాడు.శపపేటికల మధ్యే హాట్ ఛాయ్‌ను అందిస్తున్నాడు.

తాజగా ఒక ఫుడ్ బ్లాగర్ ఈ టీ స్టాల్‌ను సందర్శించాడు.ఈ సందర్భంగా టీ స్టాల్ యాజమాని గురించి వివరాలు సేకరించాడు.

ఈ స్థలం స్మశానవాటక అని కూడా తెలియకుండా కృష్ణన్ కుట్టి అనే టీ స్టాల్ యజమాని కొనుగోలు చేశాడు.దీంతో నిరుత్సాహపడకుండా కొత్త ఐడియాను ఆలోచించాడు.

సమాధుల చుట్టూ ఇనుక కడ్డీలను ఏర్పాటు చేసి కస్టమర్లు కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియాను ఏర్పాటు చేసుకున్నాడు.

Telugu Chai, Latest-Latest News - Telugu

ప్రతి రోజు ఉదయం సమాధులను శుభ్రపరిచి పూలతో అలంకరించేవాడు.ఇదేదో బాగుందని చాలామంది రావడం మొదలుపెట్టారు.ఇప్పుడు అది అందరికీ ఫేవరెట్ స్పాట్‌గా మారిపోయింది.

అయితే ప్రముఖ పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ ( Painter MF Hussain )1994లో ఈ టీ స్టాల్‌ను సందర్శించాడు.ఈ సందర్బంగా తాను గీసిన పెయిటింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు.

చాలామంది దీనిని ఒక టీ స్టాల్ గానే చూస్తున్నారని, శ్మసానవాటికగా చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు.కొత్త ఐడియాలతో చేస్తే ఎక్కడైనా బిజినెస్ సక్సెస్ అవుతుందని ఇతడు నిరూపించాడు.

ఇతడి ఆలోచన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.ఐడియా బాగుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube