స్త్రీ, పురుషులు( Women, men ) అనే తేడా లేకుండా చాలా మందిని అత్యంత సర్వసాధారణంగా వేదించే సమస్యల్లో చుండ్రు ఒకటి.చుండ్రు కారణంగా జుట్టు రాలడం పెరుగుతుంది.
అలాగే జుట్టు డ్రై గా మారిపోతుంది.ఇక తలలో దురద విపరీతంగా వస్తుంటుంది.
మీరు కూడా చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.? దాన్ని వదిలించుకోవడం కోసం ఖరీదైన షాంపూ వాడుతున్నారా.? అయినా సరే ఎలాంటి ఫలితం కనిపించడం లేదా.? అయితే వర్రీ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే కేవలం ఒక్క వాష్ లోనే చుండ్రు( dandruff ) మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును కూడా తీసుకుని నీటితో వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలు, నిమ్మ ముక్కలు( Aloe vera slices, lemon slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.తద్వారా మంచి సీరం సిద్ధమవుతోంది.ఈ హెయిర్ సీరంను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా చేస్తే చుండ్రు ఒక్క వాష్ లోనే చాలా వరకు వదిలిపోతుంది.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు అన్న మాటే అనరు.
చుండ్రు సమస్యను శాశ్వతంగా వదిలించుకోవడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది .కాబట్టి తప్పకుండా పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.