ఈ పవర్ ఫుల్ రెమెడీతో చుండ్రు ను ఒక్క వాష్ లోనే వ‌దిలించుకోవచ్చు.. తెలుసా?

స్త్రీ, పురుషులు( Women, Men ) అనే తేడా లేకుండా చాలా మందిని అత్యంత సర్వసాధారణంగా వేదించే సమస్యల్లో చుండ్రు ఒకటి.

చుండ్రు కారణంగా జుట్టు రాలడం పెరుగుతుంది.అలాగే జుట్టు డ్రై గా మారిపోతుంది.

ఇక తలలో దురద విపరీతంగా వస్తుంటుంది.మీరు కూడా చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.

? దాన్ని వదిలించుకోవడం కోసం ఖరీదైన షాంపూ వాడుతున్నారా.? అయినా సరే ఎలాంటి ఫలితం కనిపించడం లేదా.

? అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే కేవలం ఒక్క వాష్ లోనే చుండ్రు( Dandruff ) మాయం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక నిమ్మ పండును కూడా తీసుకుని నీటితో వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలు, నిమ్మ ముక్కలు( Aloe Vera Slices, Lemon Slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.

తద్వారా మంచి సీరం సిద్ధమవుతోంది.ఈ హెయిర్ సీరంను స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.

"""/" / గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఇలా చేస్తే చుండ్రు ఒక్క వాష్ లోనే చాలా వరకు వదిలిపోతుంది.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు అన్న మాటే అనరు.

చుండ్రు సమస్యను శాశ్వతంగా వదిలించుకోవడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది .కాబట్టి తప్పకుండా పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.