పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Rauth) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్(Adipurush).ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే మరోవైపు ఈ సినిమా రోజురోజుకు వివాదాలలో చిక్కుకొంటూ నెగిటివిటీని కూడా మూటకట్టుకుంటుంది.ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతరం డైరెక్టర్ హీరోయిన్ కు ముద్దు పెట్టడం వివాదంగా మారిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా థియేటర్ ను ఒక గుడిగా భావించాలని సూచించారు.అంతేకాకుండా ఈ సినిమా ప్రదర్శితం అయ్యే థియేటర్లలో ఒక సీటు హనుమంతుడి కోసం వదిలి పెట్టాలని సూచించారు.
రామాయణం ఎక్కడైతే పారాయణం చేయబడుతుందో అక్కడ హనుమంతుడు తప్పకుండా వస్తారని మన నమ్మకం.అందుకే ప్రతి థియేటర్లోనూ ఒక సీటు కేటాయించాలని సూచించారు.ఇలా ఈ సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మూఢనమ్మకాలపై విరుచుకుపడే బాబు గోగినేని(Babu Gogineni) ఆదిపురుష్ చిత్రాన్ని కెలుకుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సినిమా హాల్ ని గుడిగా మార్చేస్తున్నారు.
దీనికి మీకు పర్మిషన్ ఉందా ? సినిమా చూడడానికి వచ్చిన వారికీ కొబ్బరి కాయలు కొట్టే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారా ? అంటూ విమర్శలు చేశారు.
ఇకపోతే పీరియడ్స్ ఉన్న మహిళలు ఆది పురుష్ సినిమా చూడవచ్చా? ఇలాంటివారు సినిమా గుడిగా భావించే థియేటర్లోకి అడుగు పెట్టవచ్చా? అలాగే సినిమా థియేటర్లో పాప్ కార్న్ కు బదులు ప్రసాదాలు, అన్నదానాలు ఏర్పాటు చేయండి.అలాగే ప్రతి థియేటర్ వద్దకు ఒక పురోహితుడిని, ఆవుని తీసుకురావడమే కాకుండా ఒక హుండీని కూడా ఏర్పాటు చేయండి అంటూ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తూ విమర్శలు కురిపించారు.అలాగే రాహుకాలంలో ఈ సినిమా ప్రసారమైతే పరిస్థితి ఏంటి? సరైన సమయం చూసుకున్నారో లేదో అంటూ కూడా ఈయన ఈ సినిమా పట్ల విమర్శలు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.