బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Rauth) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయణం (Ramayanam) ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆదిపురుష్ (Adipurush).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తిరుపతి (Thirupathi)లో ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా డైరెక్టర్ ఓం రౌత్ మాట్లాడుతూ బావోద్వేగం అయ్యారు.
ఈ సందర్భంగా ఓం రౌత్ మాట్లాడుతూ తనకు భూషణ్ కుమార్ గారితో ఎంతో మంచి అనుబంధం ఉందని, వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.తనతో ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనిదని, తన మాటలు నన్ను చాలా ఎమోషనల్ గా కట్టిపడేసాయని ఓం రౌత్ తెలిపారు.ఇక ప్రభాస్ (Prabhas) గురించి కూడా మాట్లాడుతూ.ప్రభాస్ లేకపోతే ఆది పురుష్ సినిమా కూడా లేదని ఈయన తెలిపారు.కేవలం ప్రభాస్ కారణంగానే ఈ సినిమా సాధ్యమైందని తెలిపారు.ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ ఎంతో అద్భుతంగా నటించారని తెలియజేశారు.
ఆది పురుష్ సినిమా నా సినిమా కాదు నిర్మాత భూషణ్ (Bushan) సినిమా కూడా కాదు అలాగే హీరో ప్రభాస్ సినిమా అంతకన్నా కాదని ఇది మీ అందరి సినిమా.ప్రతి ఒక్క భారతీయుడు సినిమా(Indian cinima) ఇది.ఈ సినిమాని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే జై శ్రీరామ్(Jai Sriram) అంటూ ఈయన భావోద్వేగంతో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ చిత్రాన్ని రామాయణం ఇతిహాసం నేపథ్యంలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ బారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమా 16న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.