పాఠశాలలు పున: ప్రారంభం నాటికి మన ఊరు`మనబడి( Mana Ooru Mana Badi ), మనబస్తీ`మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి విద్యార్థులకు స్వాగతం పలకాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ తెలిపారు.జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన 426 పాఠశాలల్లో మన ఊరు`మనబడి, మనబస్తీ`మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనుల పురోగతిపై ఐడిఓసి సమావేశ మదిరంలో మంగళవారం విద్యాశాఖ, ఇంజనీరింగ్ విభాగపు అధికారులతో కలెక్టర్ ( V.P.Gautam )సమీక్షించారు.ఈ సందర్భంగా గ్రీన్‌చాక్ బోర్డులు, డ్యూయల్ డెస్క్‌లు, అదనపు గదులు, పెయింటింగ్ పనులు, ముగింపు దశలో ఉన్న పనులను వేగవంతం త్వరిత గతిన పూర్తి చేసి పాఠశాలలు పున: ప్రారంభం నాటికి ప్రారంభోత్సవాలు జరిగేలా ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలన్నారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, ఖమ్మం, సత్తుపల్లి పంచాయితీరాజ్ ఇ.ఇలు కె.వి.కె.శ్రీనివాస్, చంధ్రమౌళి, ఇ.డబ్లూ.ఐ.డి.సి ఇ.ఇ నాగశేషు, గిరిజానాభివృద్ధి సంస్థ ఇ.ఇ తానాజి, ఆర్.అండ్.బి ఖమ్మం, సత్తుపల్లి ఇ.ఇలు శ్యాంప్రసాద్, హేమలత, మున్సిపల్ ఇ.ఇ కృష్ణలాల్, మండల విద్యాశాఖ అధికారులు, డి.ఇలు, తదితరలు పాల్గొన్నారు.