ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లో, బైక్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.చాలామంది యువకులు జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా బైక్ లపై తిరగడం, ఎప్పుడు చూసినా స్మార్ట్ ఫోన్ లలో గేమ్స్ ఆడడం అలవాటు అయిపోయింది.
దీంతో చదువులు నిర్లక్ష్యం చేయడం, కుటుంబ సభ్యుల పట్ల రాక్షసంగా ప్రవర్తించడం లాంటివి చేసే యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్( Gorakhpur in Uttar Pradesh ) పరిధిలో జరిగి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలు ఏం జరిగిందంటే.
వివరాల్లోకెళితే.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ పరిధిలో ఉండే ఎన్ క్లేవ్ పార్ట్ – 2 ప్రాంతంలో శ్యాంసుందర్( Shyamsunder ) అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.
చిన్న కొడుకు ప్రియాంషు పాండే( Priyanshu Pandey ) (19) స్మార్ట్ ఫోన్లో ఉండే గేమ్స్ బానిస అయ్యాడు.ఇక ఎప్పుడు చూసినా చదువుకోకుండా స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడడం చేసేవాడు.
తల్లిదండ్రులు నిత్యం ఎన్నిసార్లు మందలించిన, అక్క అనన్య ( Ananya )ఎన్నిసార్లు చెప్పినా ప్రియాంషు మాత్రం తన ప్రవర్తన మార్చుకోకుండా ఎప్పుడూ చదువు పట్ల నిర్లక్ష్యం వహించేవాడు.
అయితే ఇటీవలే శ్యామ్ సుందర్ తన భార్య, పెద్ద కుమారుడు హిమన్షు లో కలిసి బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకకు వెళ్లాడు.ఆ సమయంలో ఇంట్లో కూతురు అనన్య, చిన్న కుమారుడు ప్రియాంషు పాండే మాత్రమే ఉన్నారు.ఇక ప్రియాంషు స్మార్ట్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉండగా అనన్య చదువుకో అని మందలించింది.
దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై అనన్య మెడపై బ్లేడుతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ విషయం గమనించిన ఇంటి యజమాని అనన్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఇంటి యజమాని శ్యాంసుందర్ కు సమాచారం అందించడంతో వెంటనే తల్లిదండ్రులు ఇంటికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు.తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రియాంషు పాండే ను అదుపులోకి తీసుకున్నారు.