జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది.ఇందులో భాగంగా త్వరలోనే పవన్ ‘వారాహి’ యాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఈనెల రెండో వారంలో వారాహి యాత్ర ప్రారంభం కానుంది.కాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను సాయంత్రం 5 గంటలకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించనున్నారు.
ఈ క్రమంలోనే మంగళగిరి పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశమై వారాహి యాత్రపై నాదెండ్ల చర్చించారని సమాచారం.