వైరల్: వధూవరులకు వచ్చిన వెడ్డింగ్ కిట్స్ ని ఓపెన్ చేసారు... కళ్లు బైర్లుకమ్మి పడిపోయారు?

పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం.ఇక పెళ్లిళ్లకు వెళ్ళినవారు చాలామంది తమకు తోచిన వస్తువులను కొత్తగా పెళ్ళైన జంటలకు బహుమతులుగా ఇస్తుంటారు.

 Viral Opened The Wedding Kits Received By The Bride And Groom Did They Fall Down-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇక్కడొక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా కొత్తగా పెళ్ళైన జంటలు( Newly married couples ) ఖంగుతినేలా వారికి ఇచ్చే వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పెట్టి పంపిణీ చేసింది.సదరు దృశ్యాలను చూడగానే వధూవరులిద్దరూ బిత్తరపోయారు.

Telugu Gift, Latest-Latest News - Telugu

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో( Madhya Pradesh ) చోటు చేసుకోగా.స్థానికంగా వైరల్ కావడంతో పాటు ఇపుడు ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కింది.జాబువా జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఇచ్చిన వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉండటం పెళ్ళివారినే కాకుండా స్థానికులను సైతం ఆశ్చర్యానికి గురి ఎలా చేసింది.దాంతో ఈ విషయం స్థానికంగా వివాదాస్పదమైంది.

Telugu Gift, Latest-Latest News - Telugu

జనాలు అలా అపార్ధాలు చేసుకుంటున్నారని తెలిసి ఏకంగా జిల్లా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ… అవి నిరుపయోగమైన వస్తువులు కావు.ఫ్యామిలీ ప్లానింగ్ గురించి జనాల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆ కిట్లలో వాటిని పెట్టి బహుమతిగా ఇచ్చిందని పేర్కొన్నారు.కాగా, గతంలో కూడా వధువులకు ప్రెగ్నెన్సీ టెస్టులు( Pregnancy tests ) నిర్వహించడం.అక్కడ పెద్ద దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే.ఆ సమయంలో కూడా వధువుల సాధారణ వయస్సు తెలుసుకునేందుకు, వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారో లేదో తెలిసేందుకే ఈ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కవర్ చేసుకొని చెప్పారు.తాజాగా ఈ సంఘటనతో ప్రజలు అక్కడి ప్రభుత్వంపైన గుర్రుగా వున్నారని అర్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube