స్వర్గీయ నందమూరి తారక రామారావు(Taraka Ramarao) శత జయంతి వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.మే 20వ తేదీ హైదరాబాదులో ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు హాజరైన విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్(NTR) ని కూడా ఆహ్వానించారు అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రాకపోవడంతో ఎన్నో వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన టిడీ జనార్ధన్(TD Janardhan) ఈ వార్తలపై స్పందించి అసలు విషయం వెల్లడించారు.
ఈ సందర్భంగా టీడీ జనార్దన్ మాట్లాడుతూ.ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మేము వారం రోజులపాటు ఎదురుచూసామని అనంతరం ఆయన అపాయింట్మెంట్ దొరకడంతో వెళ్ళామని తెలిపారు.ఎన్టీఆర్ ను కలిసి ఆయనకు విషయం చెప్పి తప్పకుండా రావాలని ఆహ్వానించాము.మా మాటలు విన్న తర్వాత ఎన్టీఆర్ తన పుట్టినరోజు(Birthday) కావడంతో ముందుగానే ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నామని చెప్పారని జనార్ధన్ వెల్లడించారు.
ఆ మాటకు బాబు బర్త్ డేలు చాలా వస్తాయి కానీ అన్నగారి శత జయంతి వేడుక ఒక్కసారి మాత్రమే వస్తుంది.
ఎలాగైనా ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించగా ఆరోజు ఉదయం తాను అభిమానులను కలవడానికి హైదరాబాద్ లోనే ఉంటానని చెప్పారు.అయితే వీలైతే సాయంత్రానికి ఉండి తెల్లవారుజామున వెళ్లండి అని చెప్పగా దాదాపు 22 కుటుంబాలంతా కలిసి ఈ వెకేషన్ ప్లాన్ చేసుకోవడం వల్లే ఉండకపోవచ్చని ఎన్టీఆర్ చెప్పారని ఈ సందర్భంగా టిడీ జనార్ధన్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు తారక్ రాకపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.