ఆ ఇంట్లో మరికొద్ది రోజుల్లో శుభకార్యం జరుగనుంది.శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేసే పనిలో కుటుంబం నిమగ్నమైంది.
ఇంతలో మృత్యువు ఆ ఇంటి తలుపు తట్టి వరుడుతో పాటు అతడి ఇద్దరు సోదరిమణులను సజీవ దహనం చేసింది.దీంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు జరిగిందా.? లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.దుర్గాపూర్ ( Durgapur )ప్రాంతంలో నివాసం ఉంటున్న హప్నా సోరెన్ కుమారుడైన మంగళ్ సోరెన్ కు ఇటీవలే వివాహ సంబంధం కుదిరింది.
ఆదివారం వధూవరుల కుటుంబ సభ్యులు వివాహానికి ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది.

ఈ క్రమంలో మంగళ్ సోదరీమణులైన సుమీ, బహామనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు.వీరి తండ్రి హప్నా సోరెన్ శనివారం తెల్లవారుజామున పనిమీద బయటకు వెళ్లాడు.పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట తాళం వేసి ఉండడం, లోపల మంటలు చెలరేగుతుండడంతో వెంటనే తాళం పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్లి చూస్తే కుమారుడితో పాటు ఇద్దరూ కూతుర్లు సజీవ దహనం అయ్యి విగతజీవులుగా పడి ఉండడం చూసి గుండెలు పగిలేలా రోదించాడు.

తర్వాత వెంటనే పోలీసుల( Police )కు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మంగళ్ సోరెన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఇక సుమీ, బహమనీ లను దుర్గాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పోలీసులు స్థానికులను విచారించగా హప్నా సోరెన్ ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని.అందరూ బాగానే ఉండేవారని తెలిపారు.సోదరుడి పెళ్లి ముహూర్తం కోసం కోల్ కత్తా లో నర్సుగా పనిచేసే సుమీ సోరెన్ సెలవు తీసుకొని వచ్చిందని తెలిపారు.శుభకార్యం జరగాల్సిన ఇంట్లో సజీవ దహనం జరగడంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.