పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూడని ఫ్యాన్స్ లేరు.ఈయన చేతిలో ప్రస్తుతం ఐదారు భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఒక్క సినిమా నుండి కూడా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్ ఇవ్వడం లేదు.
మరి ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఒకే నెలలో డబల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.అది కూడా జూన్ 16న డబుల్ ట్రీట్ ఖాయం అంటున్నారు.
మరి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీలలో ‘సలార్’ (Salaar) ఒకటి.కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.
ఈ సినిమా బాహుబలిని మించిన విజయం అందుకుంటుంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.మరి ఆ ప్రమోషన్స్ ను జూన్ 16న అంటే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ (Adipurush) సినిమా రిలీజ్ రోజు నుండే స్టార్ట్ చెయ్యాలని భావిస్తున్నారట.
సలార్ గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ ట్రీట్ రెడీ చేస్తున్నారట.

తాజాగా సలార్ టీజర్ (Salaar Teaser) కోసం ఒక సాలిడ్ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ టీజర్ ను ఆదిపురుష్ సినిమాతో పాటు అటాచ్ చేసి థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నట్టు టాక్.మరి ఇదే నిజమైతే జూన్ 16న థియేటర్స్ లో రెండు బిగ్గెస్ట్ ట్రీట్స్ రాబోతున్నాయి అని చెప్పవచ్చు.
చూడాలి ఆదిపురుష్ ట్రీట్ తో పాటు సలార్ ట్రీట్ కూడా ఉంటుందో లేదో.