గోవా బ్యూటీ ఇలియానా(Ileana) ప్రస్తుతం ప్రెగ్నెంట్ ( Pregnant) అనే విషయం మనకు తెలిసిందే.పెళ్లి కాకుండానే ఇలా ప్రెగ్నెంట్ అంటూ ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి ఇలియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ప్రేక్షకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.గత కొద్ది రోజుల క్రితం ఈమె తన బేబీ బంప్ (Baby Bump) ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.
తాజాగా ఇలియానా మరోసారి తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇలియానా బేబీ బంప్ తో ఉన్న మిర్రర్ సెల్ఫీ పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో తన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనపడుతుంది అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె ఏంజెల్స్(Angles) అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇలా ఏంజెల్స్ అంటూ ఇలియానా క్యాప్షన్ పెట్టడంతో ఇలియానాకు కూతురు(Daughter) పుట్టబోతున్నారా అందుకే ఇలా ఓకే ఫోటోలో తనతో పాటు తన కడుపులో బిడ్డ కూడా ఉండడంతో ఈమె ఏంజెల్స్ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఇలియానా తన బేబీ బంప్ ఫోటోలని షేర్ చేస్తూ తనకు కూతురు పుట్టబోతుందని పరోక్షంగా ఈమె తెలియజేసిందని పలువురు భావిస్తున్నారు.అయితే ఇలియానా తనకు పుట్టబోయేది కూతురు అనే విషయాన్ని చెప్పినప్పటికీ తన బిడ్డకు తండ్రి(Father) ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు.ఈమె గతంలో పెళ్లి చేసుకుని తన భర్తతో విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం ఒంటరిగా ఉన్నటువంటి ఇలియానా ప్రెగ్నెంట్ అని ప్రకటించడంతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.