ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారినటువంటి వారిలో నటి పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) నరేష్( Naresh ) జంట ఒకటి.వీరిద్దరూ గత నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ముగ్గురికి దూరంగా ఉంటూ పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు.
అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించిన ఈ జంటకు నరేష్ మూడో భార్య నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
ఇలా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ లో ఉన్న విషయం ఘట్టమనేని ఫ్యామిలీకి ఇష్టమేనా వారు ఈ జంటను అంగీకరించారా అంటూ వీరి జంట గురించి ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి.తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి( Malli Pelli ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి కృష్ణ ఫ్యామిలీ( Krishna Family) ఒప్పుకున్నారు అంటూ సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల( Vijaya Nirmala ) గారు మహేష్ ( Mahesh Babu ) మేమంతా ఒకటే ఫ్యామిలీ అని తెలిపారు.మేము ఏ విషయం గురించి ఏ నిర్ణయం తీసుకున్న అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇకమా రిలేషన్ కి కూడా కృష్ణ ఫ్యామిలీ ఏ విధమైనటువంటి అభ్యంతరం చెప్పలేదని అందరూ కూడా మా రిలేషన్ పట్ల సానుకూలంగానే ఉన్నారంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా ఈయన చేసిన ఈ కామెంట్స్ కనుక చూస్తే వీరి బంధానికి మహేష్ కూడా సానుకూలంగానే ఉన్నారని ఆయన కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.