చౌటుప్పల్ భారీగా గంజాయి పట్టివేత: డీసీపీ రాజేష్ చంద్ర...!

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం తొర్రర్ రోడ్ లో బోలోరో వాహనంలో తరలిస్తున్న 232 కేజీల బరువున్న 114 గంజాయి పొట్లాలను, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని,మరో ఇద్దరు పరారీలో ఉన్నారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు.శనివారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆయన వివరాలను వెల్లడించారు.

 Chowtuppal Drugs Smuggling Gang Arrested Dcp Rajesh Chandra,chowtuppal ,drugs Sm-TeluguStop.com

మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, ఆంధ్ర,ఒడిశాకి చెందిన మరో ఇద్దరు కలిసి ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామని,

మహారాష్ట్రకు చెందిన ముగ్గరిని అదుపులోకి తీసుకోగా, ఆంధ్రా,ఒడిశాకు ఇద్దరు పరారీలో ఉన్నారని,వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.42 లక్షలు ఉంటుందని తెలిపారు.నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న బోలోరో వాహనాన్ని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

ఈ ఆపరేషన్ లో పాల్గొన్న చౌటుప్పల్ ఏసిపి ఉదయ్ కుమార్ రెడ్డి,రామన్నపేట సిఐ సిహెచ్.మోతీరాం, అడ్డగుడూరు ఎస్సై ఉదయ్ కిరణ్,రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ సోహన్,వారి సిబ్బందిని డిసిపి అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube