మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Baskar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆరెంజ్(Orange).రామ్ చరణ్ జెనీలియా(Jenilia) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 2010 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ఇలా ఈ సినిమా అప్పట్లో తీవ్ర నిరాశను గురచేయడంతో నిర్మాత అయినటువంటి నాగబాబు (Naga Babu) కి పెద్ద ఎత్తున నష్టాలను తీసుకువచ్చింది.
ఇలా రాంచరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాని తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరిగి థియేటర్లలో విడుదల చేశారు.
ఇలా ఈ సినిమా థియేటర్లలో తిరిగి విడుదల చేసి వచ్చిన డబ్బుని జనసేన పార్టీ (Janasena Party) కోసం విరాళంగా ఇస్తానని అప్పట్లో నాగబాబు ప్రకటించారు.అయితే తాజాగా నాగబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలుస్తోంది.ఆరెంజ్ సినిమా రీ కలెక్షన్లలో సాధించిన రూ.1.5 కోట్ల రూపాయలను జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందులో నాగబాబు, అతని టీం తో కలిసి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు చెక్ అందజేశారు.
ఇలా ఆరెంజ్ సినిమా రీ కలెక్షన్లు అన్నింటిని తన పార్టీకి విరాళంగా ప్రకటించడంతో జనసేన అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆరెంజ్ మూవీ రెండోసారి విడుదల చేసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజేష్, ధర్మేంద్ర, ఎస్.కే.ఎన్, శివ చెర్రీ, శ్రీనాథ్, ఉమానాగేంద్ర, శ్రీనాథ్ తదితరుల పై నాగబాబు ప్రశంసలు కురిపించారు.ఇక నాగబాబు కూడా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పవన్ కళ్యాణ్ నియమించారు.
దీంతో ఈయన పార్టీ కార్యకలాపాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.