వార్నింగ్ ఇచ్చిన యూఎస్ ట్రెజరీ... ఉలిక్కి పడుతున్న భారత ఐటీ ఉద్యోగులు.. కారణం ఇదే!

వివిధ దేశాలలో ఆర్థికమాంద్యం రంకెలేస్తున్నవేళ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది దాదాపుగా అంతటా ఆర్థికమాంద్యం తప్పదని చెబుతున్నారు.మరీ ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ( Britain, France, Germany ) వంటి యూరోపియన్ దేశాలు ఆర్థికమాంద్యం ఎదుర్కోవడానికి సిద్ధపడిపోవాలని సూచిస్తున్నారు.

 The Us Treasury Has Given A Warning Indian It Employees Are Getting Angry This I-TeluguStop.com

ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను విపరీతంగా పెంచుకుంటూ పోతోంది.ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పాకిస్థాన్ పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు.దాదాపు పాక్ పని ముగిసినట్టే.

కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది.

Telugu Company, Indian, Latest-Telugu NRI

అదంతా పక్కనబెడితే అమెరికా ట్రెజరీ మాంద్యం( US Treasury Depression ) గురించి హెచ్చరించింది.ఆర్థికమాంద్యం తప్పకపోవచ్చని యూఎస్ ట్రెజరీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.అక్కడే వచ్చింది అసలు చిక్కు.

అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోత ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.అమెరికాలో మొత్తంగా 5,85,000 కంటే ఎక్కువ టెక్ కంపెనీ ఉన్నాయి.ఓ నివేదిక ప్రకారం యూఎస్ లో 4.4 మిలియన్లకు పైగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనిచేయగా వీరిలో దాదాపుగా 30-40 శాతం మంది భారతీయులే ఉండడం కొసమెరుపు.

Telugu Company, Indian, Latest-Telugu NRI

ఇక వీరందరికీ గడ్డుకాలం పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తోంది.అవును, సగటు భారతీయుడి డాలర్ డ్రీమ్స్ త్వరలో దెబ్బతిననున్నాయని సర్వేలు చెబుతున్నాయి.ఎందుకంటే మొదటగా ఉద్యోగాల కోతను విధించాలంటే విదేశీయులనే తీసివేస్తారు.ఇదిలా ఉంటే ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోత గురించి హెచ్చరించారు.

భారీ మాంద్యం ప్రభావం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం ఉందని నిపుణులు పదేపదే చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube