అప్పుడప్పుడు సిని ఇండస్ట్రీకి ( Cine industry )చెందిన నటీనటుల, దర్శకనిర్మాతల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.ఇదంతా కామన్ అని చెప్పాలి.
సినిమాల విషయం వల్ల వాళ్ల మధ్య మనస్పర్దాలు వస్తూ ఉంటాయి.మళ్లీ తర్వాత కు యధావిధిగా కలిసిపోతూ ఉంటారు.
కేవలం అది సినిమా సమయంలో మాత్రమే వారి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.అయితే గత కొన్ని రోజుల నుండి మహేష్ బాబు( Mahesh babu ), త్రివిక్రమ్( Trivikram ) ల మధ్య కూడా గొడవ జరుగుతుందని వార్తలు బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే దీనికి కారణం ఏంటో తాజాగా బయటపడింది.ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు అతి తక్కువ సమయంలో సూపర్ స్టార్ ( Super star )గా క్రేజ్ సంపాదించుకున్నాడు.చిన్నవయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టి తన నటనతో తండ్రికి తగ్గట్టుగా పేరు సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత హీరోగా అడుగుపెట్టి మంచి మంచి హిట్ లు అందుకొని స్టార్ హోదాకు చేరుకున్నాడు.మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు.
ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే నటి నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది.ఇక మహేష్ బాబు ఒక వైపు ఫ్యామిలీని చూస్తూ మరోవైపు తన నటన వృత్తిని కొనసాగిస్తున్నాడు.
అంతేకాకుండా పలు బిజినెస్ లు కూడా మొదలుపెట్టగా అవన్నీ నమ్రత దగ్గర ఉండి చూసుకుంటుంది.
మహేష్ బాబు గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలకు కూడా ఓకే చేశాడు.ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.
ఇక ఈ సినిమాను ఎస్.ఎస్.ఎమ్.బి 28 గా రూపొందిస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ తో అతడు, ఖలేజా సినిమాలు చేయగా ప్రస్తుతం మూడో సినిమాగా ఈ సినిమా రూపొందుతుంది.
ఇందులో పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూలు పూర్తి కాగా మూడో షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉంది.కానీ ఈ సమయంలో మహేష్ బాబు సినిమాకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిసింది.
దీంతో త్రివిక్రమ్ మహేష్ బాబు పై ఫైర్ అవుతున్నట్లు తెలిసింది.అంతేకాకుండా మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య యవ్వారం పూర్తిగా చెడిందని.
అందుకే మహేష్ బాబు సినిమాకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడుపుతున్నాడు అని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే మహేష్ బాబు అలా చేయడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.
త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ పరంగా కొన్ని తప్పులు చేస్తున్నాడని.ఫుల్ యాక్షన్ సీన్స్ లో కొన్ని పొరపాట్లు చేస్తున్నాడని.
దీంతో మహేష్ ఈ విషయాల గురించి ఎత్తి చూపక త్రివిక్రమ్.ఆయన మాటలు పట్టించుకోకుండా అదే తప్పుని మళ్ళీ చేస్తున్నాడని అందుకే మహేష్ బాబు కోపంగా ఉన్నాడని తెలిసింది.
అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నట్లు తెలిసింది.