పాకిస్థాన్ లో హై అలర్ట్

పాకిస్థాన్ లో హై అలర్ట్ కొనసాగుతోంది.మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఘర్షణలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 High Alert In Pakistan-TeluguStop.com

అటు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా పీటీఐ ఆందోళనలకు పిలుపునిచ్చింది.ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ విధించారు.

కాగా ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అరెస్ట్ ను అడ్డుకునేందుకు లాయర్లు ప్రయత్నించారు.

దీంతో లాయర్లు, రేంజర్లకు మధ్య జరిగిన తోపులాటలో న్యాయవాదులకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.అనంతరం ఇమ్రాన్ ఖాన్ ను సిద్ధంపూర్ లోని డీజీ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube