నాకు పొగరని చాలామంది అనుకుంటారు... ఎంతోమంది చేతిలో మోసపోయాను: ఝాన్సీ

ఒకానొక సమయంలో బుల్లితెర యాంకర్ గా బుల్లితెరను ఏలినటువంటి వారిలో యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) ఒకరు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

 Many People Think That I Am Not Enough I Have Been Cheated By Many People Jhans-TeluguStop.com

ఇలా ఒకవైపు వెండితెర పైన మరోవైపు బుల్లితెర పైన వరుస సినిమాలు,కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇక ఇప్పటికీ ఈమె పలు సినిమాలలో కనిపిస్తూ సందడి చేస్తుంటారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో( Interview ) పాల్గొన్నటువంటి ఝాన్సీ తన వ్యక్తిగత జీవితం గురించి తన వృత్తిపరమైన జీవితంలో తనకు జరిగినటువంటి అన్యాయం మోసం గురించి తెలిపారు.

ఈమె తన వ్యక్తిగత జీవితంలో జోగినాయుడు ( Joginaidu) అనే వ్యక్తిని వివాహం చేసుకొని తనతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనకు తెలిసిందే.ఇక కెరియర్ విషయానికి వస్తే తన వృత్తిపరమైన జీవితంలో కూడా తనను చాలా మంది మోసం చేశారని ఝాన్సీ తెలిపారు.అయితే తనని మోసం చేసిన వారి పట్ల తాను ఎప్పుడూ కక్ష సాధింపు చర్యగా వ్యవహరించలేదని ఈమె వెల్లడించారు.

ఒక కార్యక్రమానికి తాను యాంకర్ గా వ్యవహరిస్తే చివరి ఎపిసోడ్ వరకు తనని ఉండనివ్వరని చివరికి నా స్థానంలో మరొకరు వస్తారని ఝాన్సీ తెలిపారు.

ఇలా ఎందుకు జరుగుతుందో కారణం మాత్రం తనకు చెప్పరు.తన ప్రమేయం లేకుండా చివరి క్షణంలో తన స్థానంలోకి ఇతరులు వస్తారని ఇలా నాకు దక్కాల్సిన క్రెడిట్ చాలా సార్లు దక్కకుండా పోయిందని ఝాన్సీ తెలిపారు.ఇక చాలామంది నన్ను చూడగానే నాకు చాలా పొగరు అని భావిస్తారు కానీ నాతో కలిసి ప్రయాణం చేసిన వారికి మాత్రమే నేనేంటో అర్థం అవుతుందని ఈ సందర్భంగా ఝాన్సీ తన కెరియర్ పట్ల తనకు జరిగినటువంటి మోసం గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube