ఝాన్సీతో విడిపోవడానికి అసలు కారణం అదే.. కూతురిని కూడా చూడలేని పరిస్థితి అంటూ?

బుల్లితెర యాంకర్ ఝాన్సీ( Jhansi ) గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఝాన్సీకి క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతుండగా ప్రస్తుతం సినిమాలలో కూడా ఝాన్సీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

 Jogi Naidu Shocking Comments About Jhansi Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

దసరా సినిమాతో ఝాన్సీ ఖాతాలో భారీ సక్సెస్ చేరింది.ఝాన్సీ భర్త పేరు జోగినాయుడు( Joginaidu ) అనే సంగతి తెలిసిందే.

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఝాన్సీ, జోగి నాయుడు విడిపోవడం జరిగింది.అయితే ఝాన్సీతో విడాకుల గురించి, విడిపోయిన తర్వాత ఎదురైన పరిస్థితుల గురించి, కూతురిని చూసే విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి జోగి నాయుడు కీలక వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.9 సంవత్సరాల పాటు నేను, ఝాన్సీ సంతోషంగా ఉన్నామని ఆ తర్వాత గొడవలు జరగడంతో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.

Telugu Ad, Jhansi, Jogi, Tollywood-Movie

యాడ్ ఫిల్మ్ ( Ad film )ద్వారా మొదట ఝాన్సీతో పరిచయం ఏర్పడిందని జోగి నాయుడు పేర్కొన్నారు.పాప కోసం ఝాన్సీతో కలవాలని ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని ఆయన పేర్కొన్నారు.నా తమ్ముడిని బ్రతికించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదని జోగి నాయుడు చెప్పుకొచ్చారు.

ఏ విషయంలో అయినా కింద పడితే మళ్లీ పైకి రావడం సులువు కాదని జోగి నాయుడు తెలిపారు. 7 రోజులు కూతురు కోసం ఎదురుచూస్తే గంటసేపు నా కుతూరు నాతో ఉండేదని నా కూతురు ఏడుస్తూ ఇంటికి వెళ్లేదని జోగి నాయుడు చెప్పుకొచ్చారు.

జోగి నాయుడు ఆవేదనలో కూడా న్యాయం ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.తల్లీదండ్రుల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

నటుడు జోగి నాయుడు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube