హైదరాబాద్‌లో పోటెత్తిన వరదలు.. కొట్టుకుపోయిన కార్లు.. వీడియో వైరల్..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో( Hyderabad ) శని, ఆదివారాల్లో అసాధారణమైన వర్షపాతం నమోదైంది.భారీ వర్షాల కారణంగా వీధుల్లో వరదలు పోటెత్తాయి.

 Floods In Hyderabad.. Cars Washed Away.. Video Viral.. Hyderabad, Heavy Rainfal-TeluguStop.com

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఏప్రిల్ 1 – 29 మధ్య హైదరాబాద్‌లో ఏకంగా 94 మిమీ వర్షపాతం నమోదైంది.గత సంవత్సరం ఇదే కాలంలో కేవలం 6.2 మిమీ మాత్రమే నమోదయింది.అంటే ఈ ఏడాదే ఈ అకాల వర్షాలు హైదరాబాద్ జనాలను గడగడలాడించాయి.

సాధారణంగా ఏప్రిల్‌లో సగటున 20.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.అయితే హైదరాబాద్‌లో వేసవిలో ఇంత భారీ వర్షపాతం( Heavy rain ) నమోదు కావడం చాలా అరుదు.గత కొద్ది రోజులుగా కార్లు, ద్విచక్ర వాహనాలను దూరంగా తీసుకెళ్లేంత బలంగా వర్షాలు కురుస్తున్నాయి.

మరోవైపు నగరంలోని వరదల బీభత్సాన్ని స్థానికులు రికార్డ్ చేసి ఆ వీడియోలు ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.భారీ వర్షాల అనంతర పరిణామాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

తూర్పు హైదరాబాద్‌లోని నల్లకుంటలోని పద్మా కాలనీ నివాసి రికార్డ్ చేసిన ఒక వీడియో రీసెంట్‌గా వైరల్ అయింది.ఈ వీడియోలో భారీ వర్షపునీటికి కార్లు కొట్టుకుపోతున్నట్లు కనిపించింది.శనివారం నాడు ఒక నగర పౌరుడు సైబరాబాద్ అని కూడా పిలిచే HITEC సిటీలో ఒక వీడియో తీసాడు.ఇందులో చిన్నపాటి అకాల వర్షం తర్వాత పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో కనిపించింది.

ఇక అభివృద్ధి చెందిన ప్రాంతంలో అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థను ప్రజలు విమర్శిస్తున్నారు.

రాబోయే రోజుల్లో భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ( India Meteorological Department ) స్థానికులు సురక్షితంగా ఉండాలని, అవసరమైతే తప్ప తమ ఇళ్ల నుంచి బయటికి రాకూడదని హెచ్చరించింది.ఐఎండీ-హైదరాబాద్‌లోని వాతావరణ నిపుణులు ఎ శ్రావణి ప్రకారం, గత కొన్నేళ్లుగా నగరంలో ఈ స్థాయి వర్షపాతం లేదు.హైదరాబాద్‌లో చివరిసారిగా 2015లో 97.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube