స్టార్ డైరెక్టర్ మణిరత్నం( Mani Ratnam ) డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ రెండో భాగం మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది .పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తమిళ ప్రేక్షకులు ఉన్న ప్రాంతాల్లో భారీ విజయాన్ని అందుకొన్నది.
అయితే ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా మిగితా భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.తెలుగులో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లోపొన్నియన్ సెల్వన్ -2 విడుదల అవుతుంది .విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య వంటి వారు నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్ ని మెప్పించింది .దీనితో సినిమాపై అంచనాలు పెరిగాయి ఇక సినిమా విడుదల ముందు ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయి .వాటిని చుసిన ప్రేక్షకులు సినిమాపై తమదైన రీతిలో రెస్పాండ్ అవుతున్నారు .మరి పీఎస్ -2( PS-2 ) అమెరికా ఆడియెన్స్ ని ఏ మేరకు మెప్పించిందో యుఎస్ రివ్యూ లో చూద్దాం .పొన్నియన్ సెల్వన్ చిత్రం ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి( Kalki Krishnamurthy ) రచించిన పెన్నియన్ సెల్వన్ గ్రంథం ఆధారంగా తెరకెక్కింది.
తన లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్ బ్యానర్ అధినేత సుభాస్కరన్‌తో చేతులు కలిపి క్రేజీ ప్రాజెక్టుగా మణిరత్నం మలిచాడు.భారీ తారాగణంతో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేయడంలో మణిరత్నం సఫలమయ్యారు.అయితే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 అంచనాలని అందు కోలేకపోయింది అయితే పొన్నియన్ సెల్వన్ 2 మాత్రం ఆకట్టుకునేలా ఉందని యుఎస్ అభిమానులు పేర్కొంటున్నారు .అసలు కథంతా సెకండ్ పార్ట్ లోనే ఉండటంతో ఆసక్తికరంగా సాగిందని పేర్కొంటున్నారు .పీఎస్-2 టెక్నికల్ గా రిచ్ గా ఉందని చెబుతున్నారు .పార్ట్ 1 లో మిస్ అయిన ఎమోషన్స్.ఈ సినిమాలో ఉన్నాయని యుఎస్ ఆడియెన్స్ పేర్కొంటున్నారు .ఫస్ట్ పార్ట్ లో జయం రవి, కార్తీ( Jayam Ravi, Karthi ) పాత్రలు చనిపోయాయేమో అన్నట్టు చూపించారు.కానీ వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్న సీన్స్ వారు చేసిన పోరాటాలు అలరిస్తాయని చెబుతున్నారు .
జయం రవి, కార్తీ సముద్రంలో జరిగిన యుద్ధంలో మరణించినట్లు పొన్నియిన్ సెల్వన్ 1 ముగించారు.పార్ట్ 2 అక్కడ నుండే మొదలయిందని .అరుళ్మోజి మరణవార్త తెలుసుకున్న కరికాలన్ ఏం చేశారు.నందిని చోళరాజ్యాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేయాలనుకుంటుంది.మాజీ ప్రియుడు కరికాలడిని ఆమె ఎందుకు చంపాలనుకుంటుంది.అరుళ్మోజి, వల్లవరాయన్ ఏమయ్యారు.వాళ్ళను ఎవరు కాపాడారు.
వంటి ఆసక్తికర అంశాలని చూపించిన విధానం సూపర్ అంటున్నారు .అయితే ఇక్కడ తమిళ నేటివిటీ ఎక్కువ అయింది అంటున్నారు .విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లేక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్ నటన హైలైట్ అని .ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఆకట్టుకుంటుందని యుఎస్ అభిమానుకులు పేర్కొంటున్నారు .పొన్నియిన్ సెల్వన్ వన్ కంటే బెటర్ గా ఉన్నా .ఇంకాస్త బాగా తీసే వీలున్న మణిరత్నం కొని అంశాలు అసంతృప్తిగా వదిలేశారని అంటున్నారు…
.