ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డాయి.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం బాటిళ్లలో తరలించే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే టాంజానియాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.కాగా పట్టుబడిన కొకైన్ విలువ సుమారు రూ.17 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.