అఖిల్ అక్కినేని హీరోగా అఖిల్ సినిమా( Akhil Movie ) ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి.ఇక తాజాగా అఖిల్( Akhil ) సురేందర్ రెడ్డి ( Surender Reddy )దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం వరంగల్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాగార్జున ( Nagarjuna ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున అఖిల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమా కోసం అఖిల్ భారీ స్థాయిలో కష్టపడిన విషయం మనకు ట్రైలర్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.ఇక ఈ సినిమా మొత్తం అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో మెయింటైన్ చేశారు.
ఈ క్రమంలోనే అఖిల్ ఎనర్జీ లెవెల్స్ గురించి నాగార్జున మాట్లాడుతూ అఖిల్ ఎప్పుడు చాలా ఎనర్జీగా ఉంటారని వెల్లడించారు.ఇక అఖిల్ కడుపులో ఉన్నప్పుడే అమలకు( Amala ) చుక్కలు చూపించాడని నాగార్జున ఈ సందర్భంగా బయటపెట్టారు.
అమల ఎనిమిదవ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అఖిల్ క్షణం పనుకోకుండా కడుపులో చాలా యాక్టివ్ గా ఉండేవాడని దాంతో మాకు భయం వేసి డాక్టర్ వద్దకు పరుగులు పెట్టగా డాక్టర్ అఖిల్‌ను సాయిల్ మీద పడుకోబెట్టమని సలహా ఇచ్చారు.అలా తనలోని ఎనర్జీని బయటకు లాగాలని డాక్టర్ సూచించారు.అలాగే సురేందర్ రెడ్డి కూడా అదే స్టైల్ లోనే అఖిల్ నుంచి తన ఎనర్జీని మొత్తం బయటకు రాబట్టారని నాగార్జున పేర్కొన్నారు.ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారని నాగార్జున తెలియజేశారు.
ఇక ఈ సినిమాకు మమ్ముటి( Mammootty)వంటి ఒక స్టార్ హీరో ఒప్పుకున్నారు అంటే ఈ సినిమా పక్కా హిట్ అంటూ నాగార్జున ధీమా వ్యక్తం చేయడమే కాకుండా ముమ్ముట్టి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.