ఎన్నికల మూడ్ లో బీఆర్ఎస్ ! కీలక సమావేశం 

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్( BRS party ) తీవ్రంగానే శ్రమిస్తోంది.తెలంగాణలో ముక్కోణపు పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు ఉండే విధంగా, వారిని ఆకట్టుకునే విధంగా వినూత్న కార్యక్రమాలకు తెరతీస్తున్నారు.

 Brs Working President Ktr Organized Teleconference With Ministers And Mlas ,-TeluguStop.com

బిజెపి,  కాంగ్రెస్( BJP ) లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ,  జనాల్లోకి వెళుతుండడం, సభలు సమావేశాలు నిర్వహిస్తూ స్పీడ్ పెంచుతున్న నేపథ్యంలో,  టిఆర్ఎస్ కూడా ఈ రెండు పార్టీల కంటే దీటుగా పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లే విధంగా ముందుకు వెళ్తోంది .

Telugu Brs, Cm Kcr, Congress, Ktr, Telangana-Politics

ప్రస్తుతం తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం.ఇక్కడ ఎన్నికల్లో గెలిస్తే దేశవ్యాప్తంగా బీ ఆర్ ఎస్ కు రాజకీయ మనుగడ ఉంటుంది.అందుకే మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు .

Telugu Brs, Cm Kcr, Congress, Ktr, Telangana-Politics

ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కిందిస్థాయి పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకురావడం,  గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా ప్రయత్నాలు చేయడం,  నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం వంటి విషయాలపై దృష్టి సారించారు.ఇక ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లే విధంగా ఈనెల 25వ తేదీన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.ఈ మేరకు మంత్రులు , ఎమ్మెల్యేలతో టెలిక కాన్ఫరెన్స్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించారు.సభలను ఏ విధంగా నిర్వహించాలనే విషయంపై ప్రధానంగా చర్చించారు.

గతంలో తెలంగాణలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి.అభివృద్ధి పనులతో ఇప్పుడు రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారింది అనే అంశంపై సభల్లో తీర్మానాలు చేయాలనే  విషయంపై కేటీఆర్ సూచనలు చేశారు.

Telugu Brs, Cm Kcr, Congress, Ktr, Telangana-Politics

కనీసం 6 తీర్మానాలు చేయాలని సూచించారు.నియోజకవర్గ ప్రతినిధుల సభలతో వచ్చే ఎన్నికలకు సమర శంఖారావం పూరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.త్వరలో జరగబోయే మీటింగులను విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని,  ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే ప్రజల్లోకి పార్టీని ముందుకు తీసుకు వెళ్లే విధంగా బీఆర్ఎస్ నాయకులంతా పనిచేయాలని కేటీఆర్( Kalvakuntla Taraka Rama Rao ) దిశ నిర్దేశం చేశారు.ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో , పార్టీ నేతలు అంతా అలర్ట్ గా ఉంటూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీని మరింతగా బలోపేతం చేయాలని కేటీఆర్ సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube