ఈ మధ్య కాలంలో 70, 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కనీస స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేక పోతుండగా చిన్న సినిమాగా తెరకెక్కిన బలగం మూవీ( Balagam movie ) మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.ఈ సినిమాలో నటించిన వాళ్లకు తక్కువ మొత్తం పారితోషికంగా దక్కిందనే సంగతి తెలిసిందే.
బలగం సినిమాలో నటించిన లలిత ( Lalita )ఒక ఇంటర్వ్యూలో రెమ్యునరేషన్ వివరాలను వెల్లడించారు.
బలగం మొగిలయ్య( Mogilaya ) ఆరోగ్య స్థితి గురించి తెలిసి నాకు బాధ వేసిందని లలిత వెల్లడించారు.
ఆయనకు సినీ సెలబ్రిటీల నుంచి సహాయం దక్కుతోందని ఆమె చెప్పుకొచ్చారు.బలగం సినిమా కోసం వేణు ( Venu )ఎంతో కష్టపడ్డారని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన కష్టపడ్డారని లలిత వెల్లడించారు.
వేణుగారు అస్సలు విశ్రాంతి లేకుండా ఈ సినిమా కోసం పని చేశారని ఆమె పేర్కొన్నారు.
బలగం సినిమా ఆడుతుందో లేదో అని భయపడ్డానని నేను 35 రోజుల పాటు ఈ సినిమా కోసం పని చేశానని లలిత వెల్లడించారు.బలగం థియేటర్లలో రిలీజ్ కావాలని కోరుకోగా అదే విధంగా జరిగిందని ఆమె తెలిపారు.బలగం సినిమా తర్వాత మాకు మంచి పాపులారిటి దక్కిందని లలిత చెప్పుకొచ్చారు.
రచ్చరవి ( Racharavi )గారు మాకు ఈ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు.రోజుకు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల రేంజ్ లో ఆమెకు పారితోషికం దక్కిందని బోగట్టా.
బలగం సినిమాకు పరవాలేదనే స్థాయిలో రెమ్యునరేషన్ దక్కిందని నేను పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చానని లలిత వెల్లడించారు.పాత్ర మంచిదని రెమ్యునరేషన్ తక్కువైనా అంగీకరించానని ఆమె చెప్పుకొచ్చారు.దిల్ రాజు గారి బ్యానర్ లో ఛాన్స్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని ఆ బ్యానర్ లో ఛాన్స్ దక్కడమే లక్ అని లలిత చెప్పుకొచ్చారు.బలగం ఫేమ్ లలిత చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.