మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ థియేటర్లో పెద్దగా ఆడలేదు కానీ ఈ సినిమా టీవిలో సూపర్ హిట్ అయిందనే చెప్పాలి.ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వచ్చిన ప్రతిసారి టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది.
అయితే వీళ్ళ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఖలేజా ఈ సినిమా అయితే పబ్లిక్ లో మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ ప్లాప్ అయింది.త్రివిక్రమ్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్,నితిన్ లాంటి హీరోలకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినప్పటికీ మహేష్ కి మాత్రం మంచి హిట్ ఇవ్వడం లో త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి ఎట్టకేలకు ఇప్పుడు మహేష్ కి కూడా సూపర్ హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్( Trivikram ) అనుకొని సినిమా స్టార్ట్ చేద్దాం అనుకునేలోపులో ఎదో ఒక అడ్డంకి వచ్చి సినిమా ఆగిపోతుంది మొదట కరోనా ప్రాబ్లెమ్ వచ్చింది,తర్వాత మహేష్ బాబు కి కథ నచ్చక కొన్ని రోజులు లేటైంది సరే ఇప్పటికి అయినా స్టార్ట్ అవుతుంది అనుకుంటే మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు చనిపోయారు, కొద్దీ రోజులకి మళ్ళి మూవీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మహేష్ బాబు వాళ్ళ అమ్మ ఇందిరా దేవి గారు చనిపోయారు
ఇలా చాలా అడ్డంకుల్ని ఎదురుకున్న తర్వాత ఎట్టకేలకి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూలు స్టార్ట్ చేసారు సక్సెస్ ఫుల్ గానే ఎండ్ చేసారు కానీ మళ్ళి కృష్ణ గారు చనిపోవడంతో మళ్ళి కొద్దిరోజులు బ్రేక్ పడింది ఇప్పుడు తాజా గా అందుతున్న సమాచారం ఏంటి అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా పక్కన పెట్టీ మరి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా వర్క్ లో ఉన్నట్టు గా తెలుస్తుంది ఇక దీంతో మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో ఈ సినిమా గురించి ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది కానీ త్రివిక్రమ్ మాత్రం మళ్ళీ తొందర్లోనే ఇంకో షెడ్యూల్ షూటింగ్ కి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది…
అయితే మొదటి నుంచి ఈ సినిమా చాలా అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఇక అందులో భాగంగానే ఒక షెడ్యూల్ పూర్తి అయిన తరువాత ఆ స్టోరీ నచ్చకపోవడంతో మహేష్ బాబు( Mahesh Babu ) స్టోరీ మర్చమని త్రివిక్రమ్ కి చెప్పారట దాంతో స్టోరీ మారింది ఇక ఫస్ట్ షెడ్యూలు షూట్ చేసిన దానికి ఇప్పుడు చేసే దానికి సంబందం లేకపోవడం తో ఈ సినిమా ప్రొడ్యూసర్ కి 10 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరో కి సంభందించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు…ఇక త్రివిక్రమ్ ఎలాగైనా ఈ సినిమాతో మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే ఉదేశ్యం లో ఉన్నట్టు తెలుస్తుంది అందుకే కథ కూడా మార్చినట్టు తెలుస్తుంది ఈ సినిమా తొందరగా పూర్తి అయిపోతే మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమాలో జాయిన్ అయి పోతాడు.కానీ త్రివిక్రమ్ మహేష్ కాంబోకె ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని సామాన్య జనాలతో పాటు చాలా మంది సిని మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
.