జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా లక్ష్యంగా స్మోక్ బాంబు ఎటాక్ జరిగింది.ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కిషిదా ప్రసంగం ప్రారంభించిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే భారీ పేలుడు సంభవించింది.దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు పెట్టారు.
అటు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధాని కిషిదాను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకుని వెళ్లారు.ఈ ఘటనలో కిషిదాకు ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం స్మోక్ బాంబును విసిరిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.