మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జై భారత్ సత్యాగ్రహ సభ నిర్వహించనుంది.నస్పూర్ లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ బహిరంగ సభకు సుమారు లక్ష మంది వస్తారని అంచనా.
హస్తం పార్టీ ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు.ఈ మేరకు సభకు అన్ని ఏర్పాట్లను కాంగ్రెస్ శ్రేణులు పూర్తి చేశారు.
ఈ వేదికగా రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.అయితే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తరువాత దక్షిణ భారత దేశంలో నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం గమనార్హం.