ఇటీవలే కాలంలో రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతూ.కుటుంబాలను నాశనం చేస్తున్నాయి.
చివరకు సమాజంలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది.కట్టుకున్న వారే అడ్డంగా మోసం చేసేస్తున్నారు.
ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన నెల్లూరునగరం లో వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకెళితే గుంటూరుకు చెందిన వాసుకు, సామ్రాజ్యం( Vasu , samrajyam ) అనే మహిళతో 30 సంవత్సరాల క్రితం వివాహం అయింది.
వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.ప్రస్తుతం వాసు ఏఆర్ ఎస్సైగా నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే వాసు కు, సామ్రాజ్యానికి 2017 నుంచి మనస్పర్ధలు జరగడం ప్రారంభమయ్యాయి.అప్పటినుంచి వాసు తన భార్యను పట్టించుకోవడం మానేయడంతో పాటు ఇంటికి సరిగ్గా వెళ్లేవాడు కాదు.
భర్త సరిగా ఇంటికి రాకపోవడంతో సామ్రాజ్యానికి అనుమానం వచ్చింది.దీంతో సామ్రాజ్యం తన భర్త గురించి విచారించగా వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది.అయితే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ గురించి, వారు కలుసుకునే చోటు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నెల్లూరు పోస్టల్ కాలనీలో తన భర్త వేరే మహిళతో ఉన్న సందర్భంలో ఇంటి తలుపు తట్టి రెడ్ హ్యాండెడ్ గా భర్తను పట్టుకుంది.సామ్రాజ్యం ఆగ్రహంతో అందరి ముందు భర్తను చితకబాదింది.
తన భర్త తనను కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు పూర్తి అన్యాయం చేస్తున్నాడని ఆరోపించింది.తనకు తన భర్త కావాలని డిమాండ్ చేస్తోంది.
స్థానికంగా ఈ వార్త బయటకు రావడంతో వాసు పరువు పూర్తిగా పోయింది.ప్రస్తుతం ఈ వార్త నెల్లూరు మొత్తం తెలియడంతో బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం ఏంటి అని తెలిసిన వారందరూ విమర్శిస్తున్నారు.