సభలు సమ్మేళనాలు..భారీ ప్లాన్ లతో బీఆర్ఎస్ !

తమ రాజకీయ ప్రత్యర్థులు తరుచుగా విమర్శలతో విరుచుకుపడుతూ బీఆర్ఎస్ ( BRS )ను టార్గెట్ చేసుకుంటూ , జనాల్లోనూ బీఆర్ఎస్ పై చులకన భావన ఏర్పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్న తీరుపై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )ఆందోళనలో ఉన్నారు.మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి రావడం ద్వారా,  జాతీయ రాజకీయాలలోను చక్రం తిప్పాలనే ఆశలతో ఉన్నారు.

 Brs With Big Plans ,brs, Telangana, Kcr, Brs Party, Telangana Cm, Bjp,prakash Am-TeluguStop.com

దీనిలో భాగంగానే బిఆర్ఎస్ ను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు తమ రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టే విధంగా భారీగానే ప్లాన్లు వేస్తున్నారు.

Telugu Brs, Cm Kcr, Congress, Grandambedkar, Telangana, Telangana Cm-Politics

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పూర్తిస్థాయిలో తెలంగాణపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే వరుస వరుసగా భారీ బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత దగ్గర అవ్వాలనే ప్లాన్ తో ఉన్నారు.దీనిలో భాగంగానే ఈనెల 14న జరిగే భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ( grand Ambedkar statue unveiling event )నుంచి మొదలుపెడితే జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు వరుసగా భారీ సభలు సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

ఈనెల 14న హుస్సేన్ సాగర్ తీరంలో జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్( Prakash Ambedkar ) ను ఆహ్వానించాలని నిర్ణయించారు.

Telugu Brs, Cm Kcr, Congress, Grandambedkar, Telangana, Telangana Cm-Politics

అలాగే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున 35,700 మంది పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఈనెల 30న బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని భారీగానే నిర్వహించబోతున్నారు.అలాగే టిఆర్ఎస్ ప్లేనరీని ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించాలని ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు.

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో,  వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు.ఎనిమిది వేల మంది ప్రతినిధులు ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ ప్లీనరీకి హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు .ఈ మేరకు మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో పదిమందితో కూడిన పర్యవేక్షక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.ఈ విధంగా పార్టీ కార్యక్రమాలను ఉదృతం చేయడం ద్వారా జనాలను దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube