ఫలించిన భారత్ కృషి .. అమెరికా నుంచి ఇండియాకు తిరిగి రానున్న 15 కళాఖండాలు

కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.( India ) అందుకే అనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.

 New York Metropolitan Museum Of Art To Return 15 Smuggled Sculptures To India De-TeluguStop.com

నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.

వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనంతో పాటు ఎన్నో కళాఖండాలు,( Sculptures ) ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.

కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.

అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు కొందరి కృషి ఫలితంగా ఆ అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.

Telugu America, Hanuman Idol, Anthony Blinken, India, India Heritage, York, York

తాజాగా న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్( New York Metropolitan Museum of Art ) 15 పురాతన వస్తువులు భారతదేశానికి తిరిగి రానున్నాయి.పురాతన వస్తువుల స్మగ్లర్ సుభాష్ కపూర్ వీటిని ఖండాలు దాటించి అమెరికాకు విక్రయించాడు.కపూర్‌ను 2011 జర్మనీలో ఇంటర్‌పోల్ అరెస్ట్ చేసింది.ప్రస్తుతం ఇతను భారత్‌లోని జైలులో వున్నాడు.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.ఈ కళాఖండాలు క్రీస్తుపూర్వం 1వ శతాబ్ధం నుంచి క్రీస్తుశకం 11వ శతాబ్ధం వరకు చెందినవిగా తెలుస్తోంది.ఇవన్నీ టెర్రకోట, రాగి, రాయి, సిరామిక్‌తో ‌చేసినవే.30 సంవత్సరాల వ్యవధిలో ఇతను మిలియన్ డాలర్ల విలువైన కళాఖండాలను దొంగిలించినట్లు 2019లో సుభాష్‌పై అభియోగాలు మోపారు.ఇదే సమయంలో నవంబర్ 2022లో తమిళనాడు కోర్టు కపూర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Telugu America, Hanuman Idol, Anthony Blinken, India, India Heritage, York, York

కాగా.గతేడాది దీపావళి సందర్భంగా 500 ఏళ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహాన్ని అమెరికా ప్రభుత్వం భారతదేశానికి అప్పగించిన సంగతి తెలిసిందే.గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, భారతీయ దర్యాప్తు ఏజెన్సీలు కలిసి ఈ హనుమాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.దక్షిణ భారతదేశంలోని ఓ ఆలయంలోంచి 500 ఏళ్ల నాటి ఈ హనుమాన్ విగ్రహాన్ని కొందరు దొంగిలించారు.

అనంతరం దానిని ఖండాలు దాటించి అమెరికాలోని క్రిస్టీ ఆక్షన్ హౌస్‌కు విక్రయించారు.దీనిని వేలానికి పెట్టగా.ఒక ఆస్ట్రేలియా పౌరుడు కొనుగోలు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube