కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల కలకలం చెలరేగింది.దిలీప్, మస్తాన్ అనే ఇద్దరిపై మరొక వ్యక్తి కాల్పులు జరిపాడని సమాచారం.
వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన పులివెందుల ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం దిలీప్, మస్తాన్ పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది.అదేవిధంగా వివేకా హత్య కేసులో పలుమార్లు సిబిఐ అధికారులపై ఆరోపణలు చేసిన భరత్ యాదవ్ ఈ కాల్పులు జరిపాడని సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.