మీరు గమనించారో లేదో తెలియదు గాని, చాలామంది పాత స్మార్ట్‌ఫోన్ల( Old smartphones )ను సేకరిస్తూ వుంటారు.అయితే అవన్నీ ఎక్కడికి వెళుతున్నాయనే విషయాన్ని మీరు ఎపుడైనా ఆలోచించారా? లేదు కదూ.విషయం తెలియాలంటే పూర్తి కధనంలోకి వెళ్ళండి.‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పాత ఫోన్‌లను సేకరించడానికి పలు కంపెనీలు ఉత్సాహాన్ని చూపిస్తున్నవేళ దానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది.
పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి కొత్త ఐఫోన్( new iPhone )ను తక్కువ ధరకే సొంతం చేసుకోండనే డీల్స్ మనం అనునిత్యం చూస్తూ ఉంటాము.ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఇలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.
కొన్నిసార్లు పాత ఫోన్ పనిచేయకపోయినా, వాటిని ఎక్స్ఛేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇస్తుండడం కొసమెరుపు.ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా కంపెనీలు ఇలా చేస్తాయట.అయితే ఇది ఒక పెద్ద బిజినెస్ అని మీలో చాలామందికి తెలియదు.2022లో 282 మిలియన్లకు పైగా సెకండ్‌హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లు షిప్పింగ్ అయ్యాయని అనలిస్ట్ కంపెనీ IDC తాజాగా ప్రకటించడం విశేషం.వీటిలో రీఫర్బిష్డ్, వినియోగించిన స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి.ఆ సంవత్సరం షిప్పింగ్ చేసిన 1.2 బిలియన్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఇది చాలా తక్కువ అని చెప్పుకోవాలి.
‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్ట్… జోవన్నా స్టెర్న్( Joanna Stern ) రాసిన ఈ కథనంలో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.పాత ఫోన్‌లను ఏం చేస్తారని జోవన్నా స్టెర్న్ యాపిల్, శామ్‌సంగ్, ఏటి అండ్ టి, వెరిజాన్, టి-మొబైల్ కంపెనీలను అడిగారు.కస్టమర్‌ల బెస్ట్ డీల్ కోసం అలా చేస్తామని, తర్వాత వాటిని రీసేల్ లేదా రీసైకిల్ చేస్తామని మాత్రమే కంపెనీలు చెప్పడం కొసమెరుపు.
అయితే నిజానికి ఇలా సేకరించబడిన మొబైల్స్ లో డేటా ఎరేజ్ చేసి, క్లీన్ చేసి విదేశాలలోని హోల్‌సేల్ వ్యాపారులకు అమ్ముతారట.వారి నుంచి మరో కంపెనీ కొని ఇకామర్స్ ప్లాట్‌ఫారం, బ్లాక్ మార్కెట్, సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లలో వాటిని అమ్ముతారట.
అయితే అత్యధికంగా ఐఫోన్‌లకే డిమాండ్ ఉంటుంది.రీఫర్బిష్ చేసిన ఫోన్‌లు రిటైల్ ధర కంటే 20 నుంచి 30 శాతం తక్కువకు అమ్ముడుపోతాయి.