గత రెండు వారాలుగా థియేటర్స్ బాగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.సరైన సినిమా లేక వెలవెల బోతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ వారం కూడా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.అందులో ఒకటి మాస్ కాగా.
మరోటి క్లాస్.ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న థియేటర్స్ దగ్గర ఎలాంటి సందడి కనిపించడం లేదు.
అసలు ఒకేసారి క్లాస్ మూవీ మాస్ మూవీ వస్తే థియేటర్స్ దగ్గర ఆడియెన్స్ క్యూ కడతారు.కానీ ఇక్కడ పరిణామం చుస్తే వేరుగా ఉంది.ఎప్పుడు ముందస్తు బుకింగ్స్ తోనే థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేసే ఆడియెన్స్ ఈసారి మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్( Advance bookings ) ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. బలగం సినిమా తెలంగాణలో కాస్త బాగానే రన్ అవుతున్న ఆంధ్రలో మాత్రం ఏ సినిమా రాణించక పోవడంతో థియేటర్ యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఈ వారం క్లాస్ మూవీగా నాగసౌర్య( Naga Surya ) నటించిన ”ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” ( Phalana Abbayi Phalana Ammayi) యూత్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసిన అవేవీ కూడా ఈ సినిమాకు బజ్ తీసుకు రాలేక పోయాయి.దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమాత్రం బుక్ అవ్వడం లేదు.రిలీజ్ తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందా లేదంటే ప్లాప్ అవుతుందా చూడాలి.
ఇక మాస్ సినిమాగా ఉపేంద్ర ”కబ్జా” ( Kabzaa ) సినిమా రిలీజ్ కానుంది.పాన్ ఇండియా లెవల్లో బిల్డప్ ఇచ్చిన ఈ సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది.బజ్ ఏమాత్రం లేదు.ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ లోనే బజ్ క్రియేట్ చేసుకోలేదు.ఇక డబ్బింగ్ వర్షన్ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు.మరి ఈ సినిమాల్లో పాజిటివ్ టాక్ ఏ సినిమా తెచుకుంటుందో చూడాలి.
రెండు నెగిటివ్ టాక్ వస్తే ఈసారి కూడా థియేటర్స్ వెలవెల బోవడం ఖాయం.