ప్రస్తుతం ప్రపంచం మొత్తం రాజమౌళి( Rajamouli ) గురించే మాట్లాడుకుంటుంది.అయన సినిమా అంటే చాలు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు రాజమౌళి తో పని చేయాలని ఆశ పడుతున్నారు.
కానీ రాజమౌళి తో సినిమా అంటే అంత ఈజీ కాదు.అయన ఒక్కసారి అనుకున్నదంటే ఒక ఐదేళ్ల పాటు మరో సినిమా గురించి ఆలోచించ కుండా డేట్స్ మొత్తం ఇచ్చేయ్యాల్సిందే.
ఇక ఇంత సాధించిన రాజమౌళి వ్యక్తి గత జీవితం లో విషయాలు ఇప్పటికి చాల మందికి తెలియదు.ఆయన ఏం తింటారు, ఎలా ఉంటారు అని ఎవరో ఒకరు చెప్తే తప్ప అయన ఎప్పుడు మాట్లాడరు.
టాలీవుడ్ లో చాల మంది డైరెక్టర్స్ కి సినిమా ప్రెజర్ వల్ల కొన్ని అలవాట్లు అవుతాయి.
ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు.లేదంటే మందు తాగకపోతే నిద్ర కూడా పోలేరు.అలాంటి పరిస్థితులు చాల మంది దర్శకులకు ఉంటాయి.
కానీ ఇండస్ట్రీ లో ఒక్క దురలవాటు కూడా లేని ఏకైక దర్శకుడు రాజమౌళి.అయన అసలు మందు ముట్టుకోడు.
స్మోకింగ్ జన్మతః లేదు.కాలక్షేపం కోసం కేవలం ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని కార్డ్స్ మాత్రమే ఆడుతాడు.
ఇక ఎక్కడికి వెళ్లిన అయన చేతిలో డబ్బులు ఉండవు, డ్రైవర్ దగ్గరే ఎప్పుడు కొంత క్యాష్ పెడుతుందట అయన భార్య రమ( Rama ) పైగా ఏది రాస్తారో గుర్తు పెట్టుకోవడం కూడా చాల కష్టమట.తన సంతకాన్ని ఒక పది రకాలుగా పెడుతూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తారట.
మొదట సంతకం ఏం పెట్టారో రాజమౌళికి అసలు గుర్తుండదట.సినిమా అనే వ్యసనం తప్ప ఇంకొక అలవాటు లేని వ్యక్తిగా రాజమౌళి చరితలో నిలిచిపోతాడు.రాజమౌళికి కుటుంబమే బలం.ఆ కుటుంబం వల్లనే అయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు.కేవలం సినిమా గురించి మాత్రమే ఆలోచించడానికి ఆయనకు లైఫ్ టైం వదిలేసారు.ఇంకా పిల్లల గురించో లేదా ఫ్యామిలి( Family ) విషయాలను ఒక్క ముక్క కూడా అయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
అన్ని విషయాలకు అందరు ఉంటారు.అక్కడ రాజమౌళి ఉండాల్సిన అవసరం లేకుండా అందరు జాగ్రత్త పడుతూ ఉంటారు.
అందుకే రాజమౌళి కి బుర్ర అంత సినిమాతో నిండిపోయింది.