ప్రధాన వాణిజ్య పంటలలో జీడి మామిడి పంట ముఖ్యమైనది.ప్రపంచంలో అధిక విస్తీర్ణంలో జీడి మామిడి ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.
ఇక మన భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల మధ్య దాదాపు లక్ష 25 వేల హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి సాగు అవుతోంది.కానీ రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి పొందలేకపోతున్నారు.
పంట విస్తీర్ణం పెంచిన.దిగుబడిలో మాత్రం పెరుగుదల లోపం ఏర్పడడానికి యాజమాన్య పద్ధతులలో నిర్లక్ష్యం, జీడి మామిడి పంటలపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే నష్టాలను చూడవలసి వస్తుంది.
జీడి మామిడి సాగు చేయడానికి ఇసుక భూములు, ఎర్రగడ్డ నేలలు, కొన్ని కొండ ప్రాంతాలు, తీర ప్రాంత భూములు చాలా అనుకూలంగా ఉంటాయి.జీడి మామిడి చెట్లు నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో పూతకు రావడం, మార్చి నుండి జూన్ నెల మధ్యలో జీడీపిక్క దిగుబడి రావడం జరుగుతుంది.జీడి పంట సాగును చీడపీడల నుండి ఎలా సంరక్షించుకోవాలో సరైన అవగాహన లేకపోతే దిగుబడి చాలా తక్కువగా వస్తుంది.అంతర్జాతీయ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.
చెట్లు పూత దశలో ఉన్నప్పుడు సరైన అవగాహన వ్యవసాయ క్షేత్ర నిపుణుల నుండి గ్రహించి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి.
జీడి మామిడి సాగు వేయడానికి ముందే అదునులో అధిక మోతాదులో సేంద్రియ ఎరువులను వేయాలి.లేదంటే పాలియర్ స్ప్రే తో పిచ్చికారి చేయడం వల్ల పూత కొమ్మలు అధికంగా వచ్చి పంట దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి.పంట వేసిన ఐదు సంవత్సరాల తర్వాత ఒక చెట్టుకు దాదాపుగా 10 కిలోల జీడిపిక్కల దిగుబడి పొందవచ్చు.
ఎరువుల రూపంలో కాస్త సామర్థ్యం పెంచితే ప్రతి చెట్టు నుండి దాదాపు 15 కిలోల దిగుబడి పొందవచ్చు.కాబట్టి ఎవరైనా జీడి మామిడి పంట సాగు చేయాలి అనుకుంటే.
చెట్లు పూతకు వచ్చే దశలో వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు పాటించి తగిన మొత్తంలో ఎరువులు అందించడం వల్ల జీడి మామిడిలో ఆశించిన స్థాయిలో దిగుబడి పొంది మంచి ఆదాయం పొందవచ్చు.