ఒక సినిమాకి మాటలు రాయాలన్న, పాటలు రాయాలన్న అది చాలా కష్టమైన పని కానీ అది రాయడం ఇష్టం ఉన్నవాళ్ళకి అది పెద్ద కష్టం కాదు ఎందుకంటే వాళ్ళకి అదే ప్రాణం కాబట్టి.అయితే తెలుగు లో ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసిన గొప్ప లిరిక్ రైటర్ లలో వేటూరి సుందర రామ్మూర్తి, సిరివెన్నెల సీతా రామశాస్ట్రీ లు ముందు స్థానం లో ఉంటారు మన దురదృష్టం కొద్దీ ఆ ఇద్దరు కూడా ఇప్పుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం అనే చెప్పాలి.ఇక ఇప్పుడు పాటలు రాయాలి అంటే మంచి లిరిక్ రైటర్స్ ఎవరున్నారు అనే విషయం మీద ఆయా సినిమా దర్శకులకి, ప్రొడ్యూసర్స్ కి మొన్నటిదాకా క్లారిటీ సరిగా లేదు కానీ ఇప్పుడు చాలా మంది రైటర్స్ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ని చూపిస్తూ ఇండస్ట్రీ లో చాలా ఫాస్ట్ గా ముందు కు దూసుకెళ్తున్నారు అందులో ఒకరే కాసర్ల శ్యామ్…
ఈయన ఆలా వైకుంఠపురం లో సినిమాలో రాములో రాముల అనే సాంగ్ రాసారు అప్పటి నుంచి ఈయన చాలా ఫేమస్ అయ్యారు అలాగే ఈ మధ్య తెలంగాణ సాంగ్స్ మొత్తం ఆయనే రాస్తున్నారు.ఆ పాటలు రాయడం లో శ్యామ్ చాలా సిద్ధహస్తుడు దాంతో ఇప్పుడున్న దర్శకులందరికి అయన ఒక బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు…
రీసెంట్ గా ఆయన దసరా సినిమా కోసం రాసిన చెమికిలా అంగీ వేసి ఓ వదిన అనే సాంగ్ రిలీజ్ అయింది .అయితే ఈ సాంగ్ ఇప్పుడు చాలా పెద్ద సక్సెస్ సాధించింది.ఈ పాట మొన్నరిలీజ్ అయినప్పటి నుండి ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది…ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న అందరి చూపు దసరా సినిమా మీదనే ఉంది ఈ సినిమా మార్చ్ 30 న రిలీజ్ అవుతున్న నేపధ్యం లో ఈ సినిమా నుంచి వస్తున్న సాంగ్స్ గాని, ఇతర విషయాల వల్ల గాని ఈ సినిమా మీద సగటు ప్రేక్షకుడిలో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి…