ఆగర్ ఉడ్ చెట్లకు సెలైన్.. పెట్టుబడి తక్కువ.. లాభాలు లక్షల్లో..!

అగర్ ఉడ్ మొక్కలను అంతర పంటగా సాగు చేస్తే మంచి ఆదాయం అర్జించవచ్చు.ఆగర్ ఉడ్ మొక్కలకు ఇనాక్యులేషన్ ప్రక్రియ ద్వారా లాభాలు లక్షల్లో ఉంటాయి.

 Saline For Agarwood Trees Less Investment Profits In Lakhs ,agarwood Trees ,sal-TeluguStop.com

అగర్ ఉడ్ మొక్కలు ఎటువంటి సువాసన లేకుండా మామూలుగా ఉంటాయి.ఇనాక్యులేషన్ ప్రక్రియ ద్వారా మొక్కలకు సెలైన్ రూపంలో విషాన్ని ఎక్కించినప్పుడు తనను తాను కాపాడుకోవడం కోసం మొక్క రెజిన్ అనే ద్రవాన్ని విడుదల చేస్తుంది.

ఆ విడుదలైన రెజిన్ తో కలిసిన కలప ఘాటైన సుగంధ వాసనగా మారుతుంది.సుగంధ భరిత కలపకు ఇండోనేషియా, తైవాన్, లావోస్, సింగపూర్ లాంటి దేశాలలో విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ ప్రదేశాల్లో ఈ మొక్కలు అధికంగా పెంచుతారు.

ఇక భారతదేశంలో కూడా త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలలో ఎక్కువ విస్తీర్ణంలో అంతర పంటగా దీనిని సాగు చేస్తున్నారు.మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలో కూడా శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలు నాటి మంచి ఆదాయం పొంది ఆదర్శంగా కొందరు రైతులు నిలుస్తున్నారు.అయితే శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు చేతికి రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పైనే పడుతుంది.కానీ అగర్ ఉడ్ పంట కేవలం 9 సంవత్సరాల లోపే చేతికి వస్తుంది.

బై బ్యాక్ ఒప్పందంతో మార్కెటింగ్ కు ఎటువంటి డొక ఉండదు.

పైగా అంతర పంటగా దీనిని సాగు చేస్తే ఎరువులు, నీటి అవసరం తక్కువగా ఉంటుంది.ఎకరాకు దాదాపు 350 చెట్లు నాటుకోవచ్చు.10 సంవత్సరాలకు దాదాపు 25 ఇంచుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తు పెరుగుతాయి.కాబట్టి దీనికి వచ్చే హార్డ్ ఉడ్, సాప్ట్ ఉడ్ చాలా తక్కువగా 10000 ధర పలికిన కూడా ఎకరాకు దాదాపు 35 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.కాబట్టి దీనిపై అవగాహన తెచ్చుకుని తక్కువ పెట్టుబడి పెట్టి పది సంవత్సరాల తర్వాత మంచి ఆదాయం పొందవచ్చు.

ప్రముఖంగా పండుతున్న అంతర పంటలలో ఇది చాలా బెటర్ అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube