అష్టా చమ్మ సినిమాతో నాని మాత్రమే కాదు అవసరాల శ్రీనివాస్ కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.అయితే అతను నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మెప్పిస్తూ వచ్చాడు.
అతని డైరెక్షన్ లో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వచ్చి ప్రేక్షకులను అలరించాయి.ఇక త్వరలో ఫలాన అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా వస్తుంది.
ఈ సినిమాలో కూడా నాగ శౌర్య హీరోగా నటిస్తున్నాడు.మార్చ్ 17న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.
సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా అవసరాల శ్రీనివాస్ నానితో సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.
నాని హీరోగా తన డైరెక్షన్ లో సినిమా కచ్చితంగా ఉంటుంది కానీ నాని లాంటి న్యాచురల్ యాక్టర్ కు తగిన కథ నాకు వస్తే తప్పకుండా నానితో సినిమా చేస్తానని అన్నారు.నాని ప్రస్తుతం దసరాతో నేషనల్ లెవెల్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు.మరి ఈ టైం లో నాని రేంజ్ కి తగిన కథ అవసరాల సిద్ధం చేస్తాడా లేదా అన్నది చూడాలి.
ప్రస్తుతం అవసరాల కన్యాశుల్కం సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాలో ఈశా రెబ్బ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.