వైరల్: ఇలాంటి కోడి మీకు చచ్చినా దొరకదు... దీని ప్రత్యేకత ఇదే!

అవును, ఇక్కడ మీరు చదివింది నిజమే.పీనట్ (వేరుశెనగ) అనే పేరు గల ఈ కోడి ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది.

 20-year-old Hen From Usa Creates Guinness World Records,usa,guinness World Recor-TeluguStop.com

ఎందుకంటే ఈ కోడి ప్రపంచలోనే చాలా ప్రత్యేకమైన కోడిగా రికార్డులకెక్కింది.భూమిపై మనుషుల కంటే ఎక్కువగా కోళ్లే ఉన్నాయి అని ఓ సర్వే.

కచ్చితంగా చెప్పాలంటే భూమ్మీద 25 బిలియన్లు కోళ్లున్నట్టు అంచనా.అంటే కోళ్లు కూడా ఇతర పక్షి జాతుల కంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి అని ఇక్కడ మనం అర్ధం చేసుకోవచ్చు.సాధారణంగా కోళ్ల వయసు అనేది చాలా తక్కువగా ఉంటుంది.అయితే ఈ పీనట్ (వేరుశెనగ) అనే పేరు గల కోడి మాత్రం మనిషి జీవించినట్టే జీవిస్తుంది.అదే దాని ప్రత్యేకత.

మీరు ఈ విశ్వంలో ఇంకా ఎక్కడ వెతికినా ఇలాంటి కోడి కనిపించదు.USA మిచిగాన్‌లోని ఉంటున్న ఈ కోడి 2002 ఏడాదిలో జన్మించింది.ఇది పరిమాణంలో సాధారణ కోళ్ల కంటే చిన్నదిగా ఉంటుంది.

గుడ్లు పెట్టిన తర్వాత పీనట్ తల్లి అన్ని గుడ్లను వదిలివేసింది.దాంతో మెర్సీ డార్విన్ అనే మహిళ ఆ గుడ్లను చూసుకుంది.

పీనట్ గుడ్డు చల్లగా ఉందని.దీంట్లో కోడి పిల్ల బతికే అవకాశం లేదని మెర్సీ అనుకుంది.

కానీ ఆకస్మాత్తుగా ఆ గుడ్డు నుంచి చప్పుడు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది మెర్సీ.

ఆ తరువాత గుడ్డు పగలకొట్టడంతో.పీనట్ బయటకు వచ్చిందని మెర్సీ డార్విన్ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపింది.అవును, ఇప్పుడు పీనట్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

కోళ్లు సాధారణంగా 5 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే బతికి ఉండగలవు.కానీ పీనట్ వయసు 20 ఏళ్లు.

ఇప్పటికీ ఈ కోడి ఆరోగ్యంగానే ఉందని ఆమె చెబుతోంది.మార్చి 1, 2023 నాటికి.

ఈ వేరుశెనగ 20 సంవత్సరాల 304 రోజుల వయస్సును పూర్తి చేసింది.దీంతో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన కోడిగా రికార్డు క్రియేట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube