కాకి మనిషి గురించి మీరు విన్నారా... మనదగ్గరే వున్నాడు?

క్రో మ్యాన్ గురించి మీరు విన్నారా? వినలేదంటారా! ఐరన్ మ్యాన్ తెలుసు, సూపర్ మ్యాన్ తెలుసు, బ్యాట్ మ్యాన్ తెలుసు, ఆంట్ మ్యాన్ తెలుసు… కానీ ఈ క్రో మ్యాన్ గొడవ ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఇపుడు మీరు ఈ క్రో మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవలసిందే.మనలో చాలా అరుదుగా కొంతమంది జంతువులను మచ్చిక చేసుకుంటారు.

 Bhopal Man Summons Army Of Crows By Imitating Their Sound,crow Man, Crow Man Of-TeluguStop.com

అది కూడా ఓ ప్రత్యేకమైన కళ అని అనుకోవాలి.మరికొంతమంది పాముల చేత నాట్యం చేయిస్తూ వుంటారు.

ఇంకొంతమందికి పక్షులతో సావాసం చేసే కళ ఉంటుంది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ మూడో రకానికి చెందిన మనిషి గురించే.

అవును, ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి ఒక వింత ప్రతిభ ఉంది.అతడు తలుచుకుంటే కాకుల గుంపును ఒక్కసారిగా తన ముందు ప్రత్యక్షం చేసుకోగలడు.ఎలా అంటే, ఇతడికి కాకుల తరహాలో శబ్ధం చేస్తూ కాకులను పిలిచే ఒక యూనిక్ టాలెంట్ ఉంది.అతడు కాకిలా శబ్ధం చేశాడంటే ఒక్కటి కాదు.

రెండు కాదు.ఏకంగా ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఎన్ని కాకులు ఉన్నాయో అన్ని కాకులు అతడి వద్దకు చేరుతాయి.

కావాలంటే ఇక్కడ వీడియో చూడండి.అతగాడు ఒక్కసారిగా కాకి శబ్ధం చేయగానే కాకులు అన్ని ఎలా ఎగురుకుంటూ అతడి వద్దకు వస్తున్నాయో చూడండి.అందుకే అతడి టాలెంట్ చూసిన నెటిజన్లు అతగాడిని క్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు.ఈ వైరల్ వీడియోపై ఒక యూజర్ కామెంట్ చేస్తూ… “సోదరా.

మీరు శ్రాద్ధకర్మలకు కాకులను పిలిచే బిజినెస్ ప్రారంభిస్తే.మంచి బిజినెస్ ఉంటుంది.

మీ టాలెంట్ మీకు డబ్బులు కూడా సంపాదించి పెడుతుంది!” అంటూ సలహా ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube