దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఎన్నో కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో ఆయన యొక్క కెరీర్ ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.
సైరా నరసింహారెడ్డి సినిమా తో నిరాశ పర్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా ఏజెంట్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.హీరోగా అఖిల్ కు ఇది అత్యంత కీలకమైన సినిమా.
అంతే కాకుండా దర్శకుడిగా సురేందర్ రెడ్డికి కూడా ఇది అంతే కీలకమైన సినిమా.అందుకే సురేందర్ రెడ్డి ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని మరీ ఈ సినిమాను చేయడం జరిగింది.
రికార్డ్ స్థాయి బడ్జెట్ ను ఈ సినిమా కు ఖర్చు చేయడం జరిగిందట.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
అంతే కాకుండా అన్ని విధాలుగా ఈ సినిమా మెప్పించే విధంగా ఉంటుందని కూడా మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

రికార్డు స్థాయి వసూళ్లను ఈ సినిమా కనుక దక్కించుకుంటే ఇద్దరి కెరీర్ లో కూడా చాలా గొప్ప విషయం అంటూ సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది.గత కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారి అందరి అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

అన్ని వర్గాల వారిని కూడా మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది అనే అభిప్రాయంను దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సురేందర్ రెడ్డి యొక్క పూర్తి దృష్టి కూడా ఏజెంట్ పైనే ఉందట.అంతే కాకుండా ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లోని ఒక బడా హీరోతో సినిమా ను చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.